కీటకాల జీవిత చక్రంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
పొగాకు లద్దె పురుగు యొక్క జీవిత చక్రం
పొగాకు లద్దె పురుగు ఒక పాలిఫాగస్ పురుగు. ఇది బంగాళదుంప, టమోటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, బఠానీలు మరియు అలసంద పంటలను ఆశిస్తుంది. ఈ పురుగు పంటలకు నష్టం కలిగిస్తుంది. పొగాకు లద్దె పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం ఇప్పుడు చూద్దాం. _x000D_
_x000D_
పురుగు యొక్క దశలు:_x000D_
గుడ్డు - ఈ పురుగు యొక్క గుడ్లు బంగారు గోధుమ రంగులో ఉంటాయి. ఈ గుడ్ల ద్రవ్యరాశి గోధుమ రంగు తీగలతో కప్పబడి ఉంటుంది. గుడ్లు 3-5 రోజుల్లో పొదుగుతాయి._x000D_
లార్వా - లార్వా లేత ఆకుపచ్చ రంగులో ఉండి ముదురు గుర్తులతో కనిపిస్తుంది. లార్వా కాలం 2-3 వారాలు ఉంటుంది._x000D_
ప్యూప-ప్యూప ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ప్యూప కాలం సుమారు 2 వారాలు ఉంటుంది._x000D_
వయోజన చిమ్మట- వయోజన చిమ్మటలు లేత గోధుమరంగులో ఉండి, ముందు రెక్కలకు తెల్లని చారలు మరియు వెనుక రెక్కల అంచున గోధుమ రంగు మచ్చ ఉంటుంది. _x000D_
నష్టం యొక్క లక్షణాలు:_x000D_
• కొత్తగా పొదిగిన లార్వాలు చురుకుగా ఉంటాయి, అవి ఆకులోని ఆకుపచ్చ పదార్థాన్ని గీకి ఈనెలను మాత్రమే మిగులుస్తాయి._x000D_
• రెండవ మరియు మూడవ ఇన్స్టార్ లార్వాలు చిన్న రంధ్రాలను చేయడం ద్వారా ఆకులను తింటాయి. తర్వాత ఇన్స్టార్ లార్వాలు మొత్తం ఆకును, కాడలను, కొమ్మలను తిని మొక్కను నిర్వీర్యం చేస్తాయి._x000D_
• కాయలు ఏర్పడే దశలో, లార్వా కాయలను గీకి వాటిని తింటుంది. _x000D_
• ఆకులపై చిన్న రంధ్రాలు కనిపిస్తాయి._x000D_
• పురుగు తిన్న ఆకులు మరియు కాయలు రాలిపోతాయి లేదా ఎండిపోయాక తెల్లగా మారుతాయి. _x000D_
నిర్వహణ:_x000D_
_x000D_
• గుడ్డు ద్రవ్యరాశిని, చురుకుగా ఉన్న గొంగళి పురుగులను మరియు బాగా పెరిగిన గొంగళి పురుగులను సేకరించి నాశనం చేయండి_x000D_
• లింగాకర్షణ ఉచ్చులను హెక్టారుకు 15 చొప్పున ఏర్పాటు చేయండి. _x000D_
• పొలం సరిహద్దుల దగ్గర మరియు కాలువల మీద ఆముదం మొక్కలను ఎర పంటగా పెంచండి. _x000D_
• క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ లేదా క్వినాల్ఫోస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. _x000D_
మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_
_x000D_
ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_