AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
పొగాకు లద్దె పురుగు యొక్క జీవిత చక్రం
కీటకాల జీవిత చక్రంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
పొగాకు లద్దె పురుగు యొక్క జీవిత చక్రం
పొగాకు లద్దె పురుగు ఒక పాలిఫాగస్ పురుగు. ఇది బంగాళదుంప, టమోటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, బఠానీలు మరియు అలసంద పంటలను ఆశిస్తుంది. ఈ పురుగు పంటలకు నష్టం కలిగిస్తుంది. పొగాకు లద్దె పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం ఇప్పుడు చూద్దాం. _x000D_ _x000D_ పురుగు యొక్క దశలు:_x000D_ గుడ్డు - ఈ పురుగు యొక్క గుడ్లు బంగారు గోధుమ రంగులో ఉంటాయి. ఈ గుడ్ల ద్రవ్యరాశి గోధుమ రంగు తీగలతో కప్పబడి ఉంటుంది. గుడ్లు 3-5 రోజుల్లో పొదుగుతాయి._x000D_ లార్వా - లార్వా లేత ఆకుపచ్చ రంగులో ఉండి ముదురు గుర్తులతో కనిపిస్తుంది. లార్వా కాలం 2-3 వారాలు ఉంటుంది._x000D_ ప్యూప-ప్యూప ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ప్యూప కాలం సుమారు 2 వారాలు ఉంటుంది._x000D_ వయోజన చిమ్మట- వయోజన చిమ్మటలు లేత గోధుమరంగులో ఉండి, ముందు రెక్కలకు తెల్లని చారలు మరియు వెనుక రెక్కల అంచున గోధుమ రంగు మచ్చ ఉంటుంది. _x000D_ నష్టం యొక్క లక్షణాలు:_x000D_ • కొత్తగా పొదిగిన లార్వాలు చురుకుగా ఉంటాయి, అవి ఆకులోని ఆకుపచ్చ పదార్థాన్ని గీకి ఈనెలను మాత్రమే మిగులుస్తాయి._x000D_ • రెండవ మరియు మూడవ ఇన్స్టార్ లార్వాలు చిన్న రంధ్రాలను చేయడం ద్వారా ఆకులను తింటాయి. తర్వాత ఇన్స్టార్ లార్వాలు మొత్తం ఆకును, కాడలను, కొమ్మలను తిని మొక్కను నిర్వీర్యం చేస్తాయి._x000D_ • కాయలు ఏర్పడే దశలో, లార్వా కాయలను గీకి వాటిని తింటుంది. _x000D_ • ఆకులపై చిన్న రంధ్రాలు కనిపిస్తాయి._x000D_ • పురుగు తిన్న ఆకులు మరియు కాయలు రాలిపోతాయి లేదా ఎండిపోయాక తెల్లగా మారుతాయి. _x000D_ నిర్వహణ:_x000D_ _x000D_ • గుడ్డు ద్రవ్యరాశిని, చురుకుగా ఉన్న గొంగళి పురుగులను మరియు బాగా పెరిగిన గొంగళి పురుగులను సేకరించి నాశనం చేయండి_x000D_ • లింగాకర్షణ ఉచ్చులను హెక్టారుకు 15 చొప్పున ఏర్పాటు చేయండి. _x000D_ • పొలం సరిహద్దుల దగ్గర మరియు కాలువల మీద ఆముదం మొక్కలను ఎర పంటగా పెంచండి. _x000D_ • క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ లేదా క్వినాల్ఫోస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. _x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ _x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_
26
0