కీటకాల జీవిత చక్రంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
పేనుబంక పురుగు యొక్క జీవిత చక్రం
ఆర్థిక నష్టం: - పేనుబంక యొక్క పిల్ల పురుగులు లేత కొమ్మలు, ఆకులు, పువ్వులు మరియు కొత్త కాయల నుండి రసాన్ని పీల్చడం ద్వారా పంటకు నష్టాన్ని కలిగిస్తాయి, అలాగే ఇవి ఆకులపై తేన వంటి జిగట పదార్దాన్ని విడుదల చేస్తాయి. ఇది నల్లటి మసి వంటి పదార్ధం అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. ఈ పురుగు సంక్రమణ డిసెంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది. ఈ పురుగు వల్ల పంటకు 50% వరకు నష్టం జరుగుతుంది.
జీవిత చక్రం పిల్ల పురుగు: - మొదటిగా, ఈ పురుగు నవంబర్‌లో కనిపిస్తుంది. తల్లి పురుగులు అధిక సంఖ్యలో పిల్ల పురుగులకు జన్మనిస్తాయి. ఈ పిల్ల పురుగులు 3-6 రోజుల్లో పెద్దవిగా అవుతాయి. పెద్ద పురుగు: - వయోజన పురుగులు రెక్కలు ఉన్నవిగా మరియు రెక్కలు లేనివి ఉంటాయి, ఇవి ఆకుపచ్చ మరియు లేత బూడిద రంగులో ఉంటాయి. నియంత్రణ: - తెగులు సోకినప్పుడు ఆక్సిడెమెటన్ - మిథైల్ 25% ఇసి @ 1000 మి.లీ 500 లీటర్ల నీటిలో, థియామెథోక్సామ్ 25 డబ్ల్యుజి @ 100 గ్రా / ఎకరానికి 500 లీటర్ల నీటిలో, ఎసిటమాప్రిడ్ 1.1% + సైపర్‌మెత్రిన్ 5.5% ఇసి @ 175 మి.లీ 500 లీటర్ల నీటికి కలిపి హెక్టారుకు చొప్పున మొక్కల మీద పిచికారీ చేయాలి. గమనిక: - వివిధ పంటల ప్రకారం, పురుగుమందుల మోతాదు పరిమాణం మారుతుంది ఇది పంటపై ఆధారపడి ఉంటుంది. మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
242
0
ఇతర వ్యాసాలు