AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
కీటకాల జీవిత చక్రంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
పిండినల్లి జీవితచక్రం
ఆర్థిక నష్టం: మొక్కలు, కొమ్మలు,కాయలు మరియు పండ్లు మొదలైన వాటిపై పిండినల్లి పురుగు ఆశిస్తుంది. ఇది ఇతర రసం పీల్చు పురుగుల లాగా తేన వంటి జిగట పదార్దాన్ని విసర్జిస్తాయి, తేన వంటి జిగట పదార్ధం వల్ల మొక్క యొక్క ఆకులపై నల్లటి మసి వంటి పదార్ధం అభివృద్ధి చెందుతుంది._x000D_ హోస్ట్ పంటలు: ప్రత్తి, చెరకు, జామకాయ, మామిడి, దానిమ్మ మొదలైనవి._x000D_ జీవితచక్రం _x000D_ గుడ్డు: - పిండినల్లి పురుగులు 10- 20 రోజుల వ్యవధిలో 100-200 లేదా అంతకంటే ఎక్కువ గుడ్లను గుడ్డు సంచులలో పెడతాయి. గుడ్డు సంచులను ఆకులు, బెరడు, పండు లేదా కొమ్మలకు జతచేయవచ్చు. గుడ్లు పెట్టిన తరువాత తల్లి పురుగు చనిపోతుంది._x000D_ పిల్ల పురుగులు: - చిన్న గులాబీ రంగు గుడ్లు 7 నుండి 10 రోజుల్లో పొదుగుతాయి. ఇవి లేత ఆకులు, కొమ్మలు మరియు మొగ్గల నుండి రసం పీల్చడం ద్వారా పంటను దెబ్బతీస్తాయి._x000D_ పెద్ద పురుగు: - పిండినల్లి మృదువుగా, అండాకారంలో, మైనముతో కప్పబడి ఉంటుంది మరియు ఇవి తెలుపు రంగులో ఉంటాయి. ఇవి చదరంగా, అండాకారంలో లేదా గోళాకారంలో ఉంటాయి మరియు అవి మైనము లాంటి పదార్థాన్ని విసర్జిస్తాయి. పిండినల్లి యొక్క జీవిత చక్రం ఆరు వారాల నుండి రెండు నెలల వరకు ఉంటుంది._x000D_ నియంత్రణ: - హెక్టారుకు బుప్రోఫెజిన్ 25% ఎస్సీ @ 1 లీటరు లేదా మోనోక్రోటోఫాస్ 36% ఎస్ఎల్ @ 1500 మి.లీ 1000 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి మరియు హెక్టారుకు వెర్టిసిలియం లాకాని 1.15% డబ్ల్యుపి @ 2.5 కిలోలు 500 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ గమనిక: - వివిధ పంటల ఆధారంగా రసాయనాల పరిమాణం మారుతుంది._x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఎక్సలెన్స్_x000D_ _x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి._x000D_ _x000D_
294
0