కీటకాల జీవిత చక్రంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
పాము పొడ పురుగు యొక్క జీవిత చక్రం
ఆర్థిక నష్టం: లార్వా లేత ఆకులను ఆశించి ఆకు యొక్క ఎపిడెర్మల్ లేయర్ను తింటుంది, పురుగు ఆకును తినడం వల్ల ఆకు దిగువ ఉపరితలం వెండి రంగులో కనిపిస్తుంది. పొలంలో ఈ తెగులు ఆశించడం వల్ల ఆకులు ఎండిపోవడం మరియు పడిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా టమోటా, మిరప, సోయాబీన్, నేతి బీరకాయ, దోసకాయ మరియు ఇతర పంటలను దెబ్బతీస్తుంది._x000D_ జీవిత చక్రం_x000D_ గుడ్డు: తల్లి పురుగు 13 రోజుల్లో 160 గుడ్లను ఆకుల కణం లోపల పెడుతుంది. ఈ గుడ్లు 2 నుండి 3 రోజులలో పొదుగుతాయి._x000D_ లార్వా: పాము పొడ పురుగు యొక్క లార్వా ఆకు కణజాల లోపల ఒక సొరంగం చేసి క్లోరోఫిల్‌ను ఆహారంగా తీసుకుంటుంది. ఇది ఆకులపై గజి బిజిగా సొరంగాలను చేస్తుంది._x000D_ పూపా: పాము పొడ పురుగు యొక్క లార్వా 2 నుండి 20 రోజుల్లో ప్యూపాగా మారుతుంది._x000D_ తల్లి పురుగు: పాము పొడ పురుగు 6 నుండి 22 రోజుల తరువాత బయటకు వస్తుంది. ఇది దాని జీవిత చక్రంలో అనేక తరాలను పూర్తి చేస్తుంది. తల్లి పురుగులు పసుపు రంగులో పొత్తికడుపుపై నల్ల చారలను కలిగి ఉంటాయి._x000D_ నియంత్రణ: 300 లీటర్ల నీటిలో డైమెథోయేట్ 30 ఇసి @ 264 మి.లీ లేదా ఆక్సిడెమెటన్-మిథైల్ 25% ఇసి @ 1200 మి.లీ 300 లీటర్ల నీటిలో కలిపి లేదా వేప ఆధారిత పురుగుమందు 1 ఇసి @ 2 మి.లీ లీటరు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ గమనిక: వివిధ పంటల ప్రకారం పురుగుమందుల పరిమాణం మారుతుంది._x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి._x000D_
62
0
ఇతర వ్యాసాలు