AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
పశువులలో సాధారణంగా వచ్చు వ్యాధులు మరియు వాటి నివారణకు చిట్కాలు
పశుసంరక్షణపశువుల ఉత్పత్తి మరియు నిర్వహణ విభాగం, జునాగఢ్
పశువులలో సాధారణంగా వచ్చు వ్యాధులు మరియు వాటి నివారణకు చిట్కాలు
పశువుల ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం మరియు వాటి మేతకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పశుసంవర్ధక నిపుణుడు పశువులలో వ్యాధుల నిర్ధారణ గురించి తెలిసి ఉంటే, అప్పుడు వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే నయం చేయవచ్చు. పశువుల వ్యాధులు మరియు వాటికి ఇంటి వద్ద చికిత్స చేయడం వంటి సమాచారం గురించి క్రింద తెలుపబడినది. పొట్ట ఉబ్బడం ఆశించినదాని కంటే జంతువులు పచ్చి గడ్డి ఎక్కువగా తిన్నప్పుడు సాధారణంగా ఈ రకమైన వ్యాధి సంభవిస్తుంది. రుతుపవనాలు వచ్చే సమయంలో మరియు శీతాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధిలో, కడుపు వాయువుతో నిండిపోతుంది మరియు పశువులకు విశ్రాంతి లేకుండా అవుతుంది . చికిత్స •500 మి.లీ తినదగిన నూనెలో 50 నుండి 60 మి.లీ టర్పెంటైన్ నూనె వేసి పశువులకు ఆహారంగా ఇవ్వండి •మజ్జిగలో ఎర్ర కారం మరియు ఇంగువ పొడిని కలిపి పశువులకు ఇవ్వడం వల్ల పశువులకు ఉపశమనం కలుగుతుంది. •ఒక కాటన్ గుడ్డను కిరోసిన్లో నానబెట్టి, పశువులకు వాసన చూపించండి. •అధికంగా వాయువు ఉన్నట్లయితే , సన్నని సూదితో కడుపులోని వాయువును తీయండి (ఇది జాగ్రత్తగా చేయాలి; అసంపూర్ణ సమాచారంతో ఈ ప్రక్రియను చేయవద్దు.) మలబద్ధకం: పశువులు కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని జీర్ణించుకోలేవు, కావున ఆహారం పేగు కిందవరకూ చేరనందున పశువు పేడను ఉత్పత్తి చేయదు. పరిష్కారం • 250 గ్రాముల నీటిలో కరిగే ఉప్పు (మెగ్నీషియం సల్ఫేట్) ను నీటిలో కలిపి వెంటనే పశువులకు ఇవ్వండి • తినదగిన నూనె 1 లీటరు లేదా 350 మి.లీ ఆముదమును ముక్కు ద్వారా ఇవ్వండి , ఇది ఉపశమనం ఇస్తుంది. •విరేచనాలు సంభవించినప్పుడు తాజా మజ్జిగను పుట్టిన దూడకు ఆహారంగా ఇవ్వండి రెఫెరెన్స్: పశువుల ఉత్పత్తి మరియు నిర్వహణ విభాగం, జునాగఢ్
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
658
0