AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
పశువులలో బ్లాక్ క్వార్టర్ వ్యాధి నివారణ (బ్లాక్‌లెగ్)
పశుసంరక్షణhpagrisnet.gov.in
పశువులలో బ్లాక్ క్వార్టర్ వ్యాధి నివారణ (బ్లాక్‌లెగ్)
బ్లాక్ క్వార్టర్ లేదా బ్లాక్‌లెగ్ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా ఆవుకు మరియు గేదెకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి పశువులకు ఆశించినట్లయితే, కాలు చివర ఎగువ భాగంలో తీవ్రమైన వాపు కనిపిస్తుంది, దీని కారణంగా పశువులు మందకొడిగా నడవడం ప్రారంభిస్తాయి. పశువులుకు జ్వరం వస్తుంది మరియు వాపు భాగాన్ని నొక్కినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. చికిత్స మరియు నివారణ: బాధిత పశువులకు చికిత్స అందించడం కోసం పశువులను సమీపంలోని పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్ళండి. పశువులకు చికిత్స ఆలస్యం చేస్తే బ్యాక్టీరియా ద్వారా ఆశించిన టాక్సిన్ శరీరమంతా వ్యాపించి పశువుల మరణానికి దారితీస్తుంది. చికిత్స కోసం పెన్సిలిన్ టీకాలు పశువులకు అధిక మోతాదులో ఇవ్వబడతాయి మరియు వాపు వచ్చిన భాగంలో ఇవ్వబడతాయి . ఈ వ్యాధిని నివారించడానికి, పశువుల ఆసుపత్రిలో టీకా ఉచితంగా ఇవ్వబడుతుంది; పశువుల యజమానులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెఫరెన్స్: hpagrisnet.gov.in
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
250
0