AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
పండ్లలో మామిడి ఆకు వెబ్బర్ యొక్క ముట్టడి
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
పండ్లలో మామిడి ఆకు వెబ్బర్ యొక్క ముట్టడి
ఆకు వెబ్బర్స్ గత 20-25 సంవత్సరాల నుండి గమనించబడింది కానీ ఇది ఏ హాని కలిగించలేదు; అయితే గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో మామిడి పండు మరియు ఆకులు దెబ్బతినడం మొదటిసారిగా గమనించబడింది. ఇతర ప్రాంతాలలో అకస్మాత్తుగా వ్యాప్తి మరియు ఇవి చుట్టుప్రక్కల రాష్ట్రాల్లో వ్యాప్తి చెందడం జరిగింది. ఈ వ్యాప్తి ముట్టడి సాధారణంగా ఏప్రిల్ నుండి నవంబర్ వరకు జరుగుతుంది. హాని: ప్రారంభంలో లార్వా బాహ్యచర్మంను కొల్లగొట్టడం ద్వారా ఆకులపై భాగంను తినడం జరుగుతుంది. దీని తరువాత లోపల వలలను మరియు లోపలి భాగాలను తింటుంది. ఈ సంవత్సరం మామిడి పండ్లను కూడా దెబ్బతీస్తుంది మరియు గుజ్జు మీద కూడా దీని ప్రభావం ఉన్నది. ముట్టడి పండు యొక్క ఎగువ భాగంలో మొదలవుతుంటే పండ్లు రాలిపోవచ్చు.తత్ఫలితంగా,పండు నాణ్యత బాగా క్షీణిస్తుంది మరియు మార్కెటింగ్ మరియు వినియోగానికి ఇవి సరిపోదు.
సమీకృత(ఇంటిగ్రేటెడ్) నిర్వహణ: ● క్రమం తప్పకుండా కుళ్ళిన పడిపోయిన పండ్లను సేకరించాలి మరియు వీటిని పూర్తిగా చెట్టు నుండి తీసివేయాలి. ● దెబ్బతిన్న రెమ్మలను మరియు కాలానుగుణంగా లార్వా చేత తయారు చేయబడిన వలలను(చక్రాలను) కత్తిరించాలి. ● గాలి మరియు సూర్య కాంతి యొక్క కదలికలకు అనుగుణంగా చెట్లను క్రమం తప్పకుండా కత్తిరించాలి. ● ఏప్రిల్ నుండి నవంబర్ వరకు తోటలలో కాంతి ఉచ్చులను ఏర్పాటు చేయాలి. ● 10-15 రోజుల విరామం వద్ద 10 లీటర్ల నీటికి బవేరియా బాసియానా @40 గ్రాములను పిచికారి చేయాలి లేదా వేప విత్తనాల గుజ్జు యొక్క ద్రావణము @5% లేదా 10 లీటర్ల నీటికి వేప ఆధారిత సూత్రీకరణ 1500 ppm లేదా 1000౦ ppm @ 10 మి.లీ లను పిచికారి చేయాలి. ● ముట్టడి పెరుగుతున్నప్పుడు,ప్రొఫెనోఫోస్ 50 EC @ 10 మి.లీ ను పిచికారి చేయాలి లేదా నోవాల్యురాన్10 EC @ 10 మి.లీ లేదా లాంబ్డా సైహిలోథ్రిన్ 5 EC @ 10 మి.లీ లను 10 లీటర్ల నీటితో పిచికారి చేయాలి. ● మామిడి పండ్లకు పిచికారికి మరియు సాగుకు మధ్య సరైన విరామాన్ని ఉంచాలి. డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
203
0