AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
నీటిలో కరిగే ఎరువులు - ప్రయోజనాలు
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
నీటిలో కరిగే ఎరువులు - ప్రయోజనాలు
నీటిలో సులభంగా కరిగిపోయే ఫెర్టిలైజర్స్ ను కరిగే ఎరువులుగా పిలుస్తారు. ఈ ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలు అర్ధం చేసుకున్న నేటి రైతాంగం గతంలో కంటే ఇటీవలకాలంలో ఈ కరిగే ఎరువులను విరివిగా వాడుతున్నారు. ఈ ఎరువుల వల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం • ఈ ఎరువులకు నీటిలో సులభంగా కరిగే స్వభావం ఉంటుంది. కాబట్టి పంటలకు అవసరమైనప్పుడల్లా వినియోగించవచ్చు. ఇవి అందుబాటులోనే ఉంటాయి. • ఈ ఎరువుల వల్ల పంటకు నీరు మరియు పోషకాలు క్రమపద్దతిలో అందుతాయి. దీంతో సహజంగానే పంట ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. • ఎగుమతులకు అవసరమైన నాణ్యమైన పంట ఉత్పత్తిని సాధించడానికి ఈ ఎరువులు తోడ్పడతాయి. • నీటిలో కరిగే ఈ ఎరువులను పంట చేతికొచ్చే దశవరకూ రోజా లేదా రోజు విడిచి రోజు వాడొచ్చు. • ఈ ఎరువును పంటచేలో మొక్కల వేర్ల వద్ద నేరుగా అందించవచ్చు. దీని వల్ల వేర్లకు అవసరమైన పోషకాలు వేగంగా అందుతాయి. • నీటిలో కరిగే స్వభావం ఉన్న ఈ ఎరువులను పంటచేలకు వాడేందుకు సులభమైన, తేలికపాటి పద్దతులుంటాయి. పైగా ఇవి మొక్కల వేర్లుపై ఎలాంటి దుష్ర్పభావం చూపవు. • పంటకు ఈ ఎరువులు వేసేపద్దతి సులభంగానూ, సౌలభ్యంగానూ ఉంటుంది. కూలీల ఖర్చు కూడా చాలావరకు తగ్గుతుంది. • ఈ ఎరువులు రోజువారీ లేదా ప్రత్యామ్నాయ రోజులలో ఇవ్వడం వలన పోషకాలు వ్రుధా కావు.
• ఈ ఎరువులకు యాసిడ్ స్వభావం కూడా ఉంటుంది. దీంతో పంటచేలో మట్టి యొక్క pH నియంత్రించటానికి సహాయపడుతుంది. బిందు సేద్యం ద్వారా ఖనిజాలు ఒకేచోట నిక్షిప్తం కాకుండా చూస్తాయి. • సోడియం క్లోరైడ్ వంటి హానికరమైన రసాయనాల కంటే ఈ ఎరువులు ఎంతో సురక్షితమైనవి. భూసారం యొక్క స్వభావం దెబ్బతినే అవకాశం ఉండదు. దీంతో సహజంగానే పంట ఉత్పత్తి నాణ్యత మెరుగుడుతుంది. • తేలికపాటి నేలలో కూడా అధిక దిగుబడిని ఇచ్చేందుకు ఈ ఎరువులు వాడక విధానం ఉపయోగపడుతుంది.
2
0