AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
నిమ్మ పంటలో పాము పొడ పురుగు యొక్క జీవిత చక్రం
కీటకాల జీవిత చక్రంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
నిమ్మ పంటలో పాము పొడ పురుగు యొక్క జీవిత చక్రం
నిమ్మ చెట్టు యొక్క లేత ఆకులలో సొరంగాలు సృష్టించడం ద్వారా పాము పొడ పురుగు ఆకును తింటుంది. పురుగు తిన్న ఆకు ఉపరితలం క్రింద సన్నని ముదురు వెండి రేఖ కనిపిస్తుంది. ఆకులు పాలిపోయినట్టు మరియు ముడతలు పడి ఉంటాయి. ముట్టడి తీవ్రంగా ఉంటే ఆకులు రాలిపోతాయి. గజ్జి తెగులు యొక్క వ్యాప్తికి ఈ పురుగు సహాయపడుతుంది. _x000D_ _x000D_ జీవిత చక్రం:_x000D_ పాము పొడ పురుగు యొక్క జీవిత చక్రం నాలుగు దశలలో ఉంటుంది: గుడ్డు, లార్వా, ప్యూపా మరియు వయోజన చిమ్మట. కీటకం యొక్క మొత్తం జీవిత చక్రం పూర్తి కావడానికి 3 నుండి 7 వారాలు పడుతుంది._x000D_ _x000D_ గుడ్లు:_x000D_ గుడ్లు పెట్టిన 1 వారం తరువాత అవి పొదుగుతాయి. కొత్తగా ఉద్భవించిన లార్వా ఆకును ఆహారంగా తీసుకోవడం ప్రారంభిస్తాయి._x000D_ లార్వా:_x000D_ ప్రారంభంలో లార్వా చిన్న, దాదాపు కనిపించని స్వరంగాలను ఉత్పత్తి చేస్తుంది. లార్వా పెరిగేకొద్దీ, స్వరంగాలు మరింత గుర్తించదగినదిగా మారుతాయి._x000D_ ప్యూప:_x000D_ లార్వా ప్యూపాగా మారిన తర్వాత , ఆకు ముడుచుకున్నట్లు మారుతుంది. ప్యూపా దశ 1 నుండి 3 వారాల వరకు ఉంటుంది._x000D_ వయోజన పురుగు:_x000D_ ఇవి మొక్కలకు ఎటువంటి నష్టాన్ని కలిగించవు మరియు ఇవి 1 నుండి 2 వారాలు మాత్రమే జీవిస్తాయి._x000D_ నియంత్రణ చర్యలు:_x000D_ ఇమిడాక్లోప్రిడ్ 17.80% ఎస్ఎల్ @ 20 mlఇవ్వడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు._x000D_ _x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_ _x000D_
69
4