AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
తక్కువ ఉత్పత్తి కారణంగా, పప్పుధాన్యాల ధరలు కూడా పెరగవచ్చు
కృషి వార్తది ఎకనామిక్ టైమ్
తక్కువ ఉత్పత్తి కారణంగా, పప్పుధాన్యాల ధరలు కూడా పెరగవచ్చు
న్యూ ఢిల్లీ: ఈ సంవత్సరం పప్పుధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల వీటి ధరల పెరుగుదలకు దారితీయవచ్చు. దీనిని పరిష్కరించడానికి, పప్పుధాన్యాల దిగుమతుల పరిమాణంపై ఉన్న నిషేధాన్ని తొలగించడం ద్వారా దిగుమతులను పెంచాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సూచించింది. ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశీయ అవసరాలను తీర్చడానికి తగినంత పప్పుధాన్యాలు ఉన్నాయి, కానీ ఏదైనా అనుకోని పరిణామాల వల్ల కొరత కలగొచ్చు. దిగుమతులను నిషేధించడం వల్ల నడుమ పప్పుధాన్యాల ఉత్పత్తి పడిపోతుందనే భయాల వల్ల ధరలు పెరుగుతాయి. మధ్యప్రదేశ్ వంటి ప్రధాన ఉత్పాదక రాష్ట్రాల్లో, మినుముల పంట 50 శాతం దెబ్బతింది. పప్పుధాన్యాల పంటలు భారీ వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నవంబర్ 15 తో ముగిసే ఈ ఏడాది కంది పప్పు దిగుమతి కోసం ప్రభుత్వం నాలుగు లక్షల టన్నుల కోటాను నిర్ణయించింది. మినుములు మరియు పెసలు దిగుమతి తేదీ ఇప్పటికే అక్టోబర్ 31 తో ముగిసింది. పప్పుధాన్యాల ధర పెరగవచ్చని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. పప్పుధాన్యాల రిటైల్ ధర, ముఖ్యంగా కంది పప్పు, కిలోకు 100 రూపాయలు దాటింది. మూలం - ఎకనామిక్ టైమ్స్, 15 నవంబర్ 2019 ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
61
0