సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
జామచెట్ల ఎదుగుదల మరియు ఎరువుల నిర్వహణ
జామ చెట్టు కొమ్మలను ఎప్పుడుపడితే అప్పుడు కత్తిరించకూడదు, మొక్కలు సరైన పద్దతిలో ఎదిగేలా జాగ్రత్త వహించాలి. సరైన సమయంలో కొమ్మలను కత్తిరించడం ద్వారా చెట్లు క్రమపద్దతిలో పెరుగుతాయి. కాండం నుంచి పెరుగుతున్న జామచెట్టు అరమీటర్ (0.5m)) ఎత్తులో ఉన్నప్పటి నుంచి కాలానుగుణంగా కత్తిరించాలి. చెట్టు సమతుల్యాన్ని కాపాడటానికి, 3-4 కొమ్మలు సమానంగా ఉండేలా చూసుకుని కత్తిరించాలి. ఎరువుల నిర్వహణ – జామతోటలో మొదటి నాలుగు సంవత్సరాలు సరైన మోతాదులో ఎరువులను వేస్తే చెట్లు వేగంగా పెరుగుతాయి. • ఏటా రుతుపవనాలు రావడానికి ముందే ప్రతిచెట్టకు 20 నుండి 22 కిలోల చొప్పున ఎఫ్.వై.ఎమ్( FYM) ఎరువు వేయాలి. • 6 నెలల తర్వాత మొక్కలకు 150 గ్రాముల నత్రజని, 50 నుండి 60 గ్రాముల భాస్వరం, 50గ్రాముల పొటాష్ ఇవ్వాలి • తరువాతి సంవత్సరం నుంచి ప్రతిచెట్టకు మొదలు వద్ద మూడుపాదులుగా చేసి 800 గ్రాముల నత్రజని, 400 గ్రాముల భాస్వరం, 400 గ్రాముల పొటాష్ ఎరువులుగా వేయాలి.
నీటి నిర్వహణ - జామ చెట్టు కొంతకాలం నీరు లేకపోయినా తట్టుకోగలదు. అయితే నేల రకాన్ని బట్టి కొత్తగా వేసిన తోటలకు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటిని అందించాలింది. కాండం చుట్టూ రెండు వృత్తాలుగా చేసి మొదటిదానిలో కాకుండా రెండో వలయంలో నీటిని వదలాలి. వేసవిలో 10 నుండి 15 రోజులకోసారి, శీతాకాలంలో అయితే 20 రోజులకోసారి నీటిని వదలాలి. చెట్టు పెరుగుతున్న కొద్దీ పాదులను పెద్దగా చేసి నీటిని వదలాలి.
3
0
ఇతర వ్యాసాలు