AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
జంతువులు ఈనే సమయానికి ముందు తీసుకోవలసిన సరైన జాగ్రత్తలు
పశుసంరక్షణవెటర్నరీ సైన్స్ సెంటర్, ఆనంద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.
జంతువులు ఈనే సమయానికి ముందు తీసుకోవలసిన సరైన జాగ్రత్తలు
మనము జంతువులు ఈనడానికి ముందు ఎందుకు శ్రద్ధ తీసుకోవాలి? పాలిచ్చే జంతువులు, ఆవులు మరియు గేదెలు ప్రతి 13 లేదా 14 నెలలకు ఒకసారి ఈనడం జరుగుతుంది మరియు ఆరోగ్యకరమైన దూడలు పుడతాయి. దీని కోసం, 3-4 నెలలు ఈనే సమయం ఉంటుంది తర్వాత, జంతువులు మళ్లీ వేడిగా ఉండి 1-2 సార్లు ఫలదీకరణం తర్వాత గర్భం దాల్చుతుంది. ఈనే సమయానికి ముందు చివరి మూడు నెలలు 1. జంతువు ఎక్కువ కాలం నీటిలో ఉండకూడదు లేదా కొండ లేదా ఎగుడుదిగుడు ప్రాంతాలలో కదలకూడదు, ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే పిండం యొక్క కదలికల వలన జంతువుల పునరుత్పాదక మార్గము లేదా గర్భాశయం పాడవుతుంది. అది కూడా కష్టమైన ప్రసవానికి దారి తీస్తుంది లేదా జంతువు మరణానికి అవకాశం ఉంటుంది తల్లి జంతువుకు మరియు పిండం కు రెండింటి ప్రమాదం సంభవించవచ్చు. 2. ఆ జంతువులు వాపుతో (ఉబ్బరం)తో బాధపడుతున్న సమయంలో. ఎలాంటి ఆహారాన్ని ఇవ్వకూడదు , 3.ఒక వేళ కాన్పుకు ముందు అవయవం జారినట్లైతే(డెల(ఈనడానికి ముందు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మూత్రజనిత నిర్మాణాల యొక్క ప్రోట్రేషన్), అప్పుడు జంతువులను పశువైద్యుడికి దగ్గరకు తీసుకుపోవాలి మరియు దానికి అనుగుణంగా పశువైద్యుడి సలహాలను తీసుకోవాలి. 4.ఒకవేళ జంతువు గతంలో కాన్పుకు ముందు అవయవం జారినట్లైతే, అప్పుడు దాని ముందరి కాళ్ళు ఒక వాలులో ఉండే విధంగా కట్టేయాలి.
5. ఆవు-గేదెలలో ఈనడానికి ముందు గల చివరి మూడు నెలలు చాలా కీలకమైనవి. జంతువు తనకు తాను మరియు పెరుగుతున్న పిండం పైన కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది . అందువలన, ఈ సమయంలో, తగినంత పరిమాణంలో పోషకాలు గల ఆహారం (ఖనిజ పదార్థాలు,ఉప్పు మిశ్రమంతో ఉన్న పొడి-ఆకుపచ్చ పశుగ్రాసం)ను అందించాలి. పశువుల పాక(కొట్టం)ను పరిశుభ్రంగా ఉంచాలి మరియు జంతువుకు ప్రత్యేకమైన చికిత్సను అందించాలి. రిఫరెన్స్: వెటర్నరీ సైన్స్ సెంటర్, ఆనంద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
764
0