AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
చెరకులో దూదేకుల పురుగు నిర్వహణ
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
చెరకులో దూదేకుల పురుగు నిర్వహణ
ఈ కీటకాలు చాలా చురుకైనవి మరియు ఇవి ఒక ఆకు నుండి మరొక ఆకుకు దూకుతాయి. ముట్టడి ఎక్కువగా ఉన్న క్షేత్రంలో బిగ్గరగా శబ్దం వినబడుతుంది. పిల్ల పురుగులు & తల్లి పురుగులు రెండూ ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి.ఇవి శరీరం నుండి తేన వంటి జిగట పదార్దాన్ని విసర్జిస్తాయి మరియు ఇది ఆకులపై పడుతుంది. తత్ఫలితంగా, చెరకు ఆకులపై నల్లని మసి లాంటి మచ్చలు అభివృద్ధి చెందుతాయి, ఇది చెరకు యొక్క కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేస్తుంది మరియు అందువల్ల భారీగా దిగుబడికి నష్టం కలుగడం గమనించవచ్చు. చెరకులో దూదేకుల పురుగును నియంత్రించడానికి కొన్ని నిర్వహణ పద్ధతులను ఇక్కడ చర్చిద్దాం. నిర్వహణ: • తల్లి పురుగులు పెట్టిన గుడ్ల సమూహాన్ని సేకరించి నాశనం చేయండి. • మెటారైజియం అనిసోఫిలే అను ఫంగల్ ఆధారిత సూత్రీకరణను 40 గ్రాములు, 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. • ఎపిరికేనియా మెలనోలుకా అను పరాన్నజీవిని హెక్టారుకు 1 లక్ష పరాన్నజీవులు (250 గుడ్డు ద్రవ్యరాశి) లేదా 2000 ప్యుపాలను విడుదల చేయండి. • పరాన్నజీవులను విడుదల చేసిన ప్రాంతం / పొలాలలో రసాయన పురుగుమందులను పిచికారీ చేయవద్దు. • పరాన్నజీవుల ప్రభావం గమనించనట్లయితే, దూదేకుల పురుగు యొక్క ముట్టడి క్షేత్రంలో ఎక్కువగా ఉంటుంది, అప్పుడు క్లోర్‌పైరిఫోస్ 20 ఇసి @ 20 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 36 ఇసి @ 10 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
135
1