సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
చలికాలంలో చలి నుండి పంటలను రక్షించడానికి ఈ పద్ధతులు సహాయపడతాయి
శీతాకాలంలో, చాలా పంటలు శీతాకాలపు మంచుతో ప్రభావితమవుతాయి, ఇది డిసెంబర్ మరియు జనవరి మధ్య జరుగుతుంది. ఉష్ణమండల ప్రాంతాల్లో పండించిన పంటలలో, శీతాకాలపు మంచు పంట నాణ్యత మరియు ఉత్పత్తి మీద చూపించే ప్రభావాన్ని గమనించవచ్చు. ఫలితంగా, పండ్ల పంట కూడా భారీ నష్టాలను చవిచూస్తుంది. ఇవి కాకుండా, ఆకులు, పువ్వులు, పండ్లు కుళ్లిపోవడం వల్ల బ్యాక్టీరియా వ్యాధుల వ్యాప్తిని కూడా గమనించవచ్చు. పండ్లపై మచ్చలు కనిపిస్తాయి, ఇది వాటి రూపాన్ని మరియు రుచిని కూడా పాడు చేస్తుంది. పంటలను మంచు నుండి రక్షించడానికి తీసుకోవలసిన చర్యలు 1. పండ్ల మొక్కలు మంచు వల్ల దెబ్బతినకుండా ఉండడానికి గాను, మొక్కల క్రింద 100 వాట్ల బల్బును ఏర్పాటు చేయాలి. 2. మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, బీట్‌రూట్, క్యారెట్, గోధుమ, ముల్లంగి, బార్లీ మొదలైన పంటలను పండించడం ద్వారా మంచు ప్రభావం తగ్గుతుంది. 3. మంచు వల్ల ప్రభావితమైన పంటల మీద 0.1% సల్ఫర్ ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల కొంతవరకు దాని ప్రభావం తగ్గుతుంది. 4. నత్రజని ఎరువులు మరియు ఇతర పోషకాలను చల్లడం ద్వారా పండ్ల మొక్కలను మంచు వల్ల దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. 5. మొక్కలను మంచు నుండి రక్షించడానికి గాను మైక్రో మరియు సెకండరీ ఎలిమెంట్లను మొక్కల మీద పిచికారీ చేయాలి. 6. పొలంలో మంచు కురిసే అవకాశం ఉన్నప్పుడు పంటకు నీరు పెట్టాలి. 7. పొలానికి నాలుగు వైపులా సాయంత్రం వేళలలో పొగ పెట్టాలి. మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
442
0
ఇతర వ్యాసాలు