క్షమించండి, మీరు ఎంచుకున్న భాషలో ఈ ఆర్టికల్ అందుబాటులో లేదు.
Agri Shop will be soon available in your state.
కృషి వార్తఔట్లుక్ అగ్రికల్చర్
గోధుమ పంటను విత్తడం సుమారు 10 శాతం పెరిగింది
న్యూ ఢిల్లీ: అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు కారణంగా రబీ పంటలను విత్తడం జరిగింది. ప్రస్తుత రబీ సీజన్‌లో గోధుమ పంటను విత్తడం 9.70% పెరిగింది. ప్రధాన రబీ పంట అయిన గోధుమ పంటను ప్రస్తుత సీజన్‌లో 297.02 లక్షల హెక్టార్లలో విత్తడం జరిగింది, గత ఏడాది 270.75 లక్షల హెక్టార్లలో మాత్రమే గోధుమ పంటను విత్తినట్టు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అదే సమయంలో, మొత్తం రబీ పంటల సాగు 571.84 లక్షల హెక్టార్లకు పెరిగింది, గత సంవత్సరం ఈ సమయం వరకు 536.35 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలను సాగు చేయడం జరిగింది. ప్రస్తుత రబీ సీజన్లో పప్పుధాన్యాల పంటను విత్తడం 140.13 లక్షల హెక్టార్లకు పెరిగింది, గత సంవత్సరం 136.83 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాల పంటను నాటడం జరిగింది. రబీ పప్పుధాన్యాల ప్రధాన పంట అయిన శనగ పంటను గత ఏడాది 89.89 లక్షల హెక్టార్ల నుండి 94.96 లక్షల హెక్టార్లలో విత్తడం జరిగింది . రబీలో 15.18 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాలను, 9.08 లక్షల హెక్టార్లలో బఠానీ పంటను విత్తడం జరిగింది. మినుములు పంట 5.70 లక్షల హెక్టార్లలో మరియు పేసర్లు పంట 2.55 లక్షల హెక్టార్లలో నాటడం జరిగింది. మూలం - ఔట్లుక్ అగ్రికల్చర్, 27 డిసెంబర్ 2019 ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
137
0
సంబంధిత వ్యాసాలు