గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్ యొక్క సమగ్ర సస్య రక్షణ
క్యాబేజీని సాధారణంగా ఏడాది పొడవునా సాగు చేస్తారు. భారతదేశంలో, క్యాబేజీని 0.31 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 6.87 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పండిస్తున్నారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటకలలో దీనిని పండిస్తారు. ఈ రాష్ట్రాల్లో, సాగు మరియు ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. క్యాబేజీలో గమనించే ప్రధాన తెగులు డైమండ్ బ్యాక్ మాత్ (డిబిఎం). ఈ తెగులు మొట్టమొదట 1914 లో హర్యానాలో నివేదించబడింది మరియు అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. డిబిఎం తో పాటు, పేనుబంక , ఆకు తినే గొంగళి పురుగులు మరియు క్యాబేజీ తల తొలుచు పురుగు కూడా పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. చిమ్మట విశ్రాంతి దశలో ఉన్నప్పుడు, ఇది వజ్రంలా కనిపిస్తుంది; అందువలన, దీనిని డైమండ్ బ్యాక్ మాత్ అంటారు. పసుపు-ఆకుపచ్చ పురుగు మొదట్లో ఆకుల పత్రహరితాన్ని తిని, ఆపై ఆకుల మీద రంధ్రాలను చేస్తుంది. అధిక ముట్టడి ఉన్నట్లయితే, మొక్క మొత్తం క్షీణిస్తుంది మరియు ఈనెలు మాత్రమే మిగిలి ఉంటాయి.
నిర్వహణ :_x000D_ • టమోటాను అంతరపంటగా పెంచండి._x000D_ • ఆవాలు లేదా క్రెస్‌ను ఎర పంటగా పెంచండి ._x000D_ • లింగాకర్షణ బుట్టలను హెక్టారుకు 10 చొప్పున ఏర్పాటు చేయండి. _x000D_ • ముట్టడి ప్రారంభ దశలో, వేప విత్తన సారం 500 మి.లీ / ఎకరం (5%) లేదా బాసిల్లస్ తురింజెన్సిస్ బాక్టీరియల్ పౌడర్ 10 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ • 10 లీటర్ల క్రిమిసంహారక లేదా బొటానికల్, పురుగుమందుల ద్రావణంలో ఏదైనా డిటర్జెంట్ పౌడర్ 10 గ్రాములు జోడించండి, ఇది సామర్థ్యాన్ని పెంచుతుంది._x000D_ • ఈ తెగులు పురుగుమందులకు వ్యతిరేకంగా తట్టుకునే స్వభావాన్ని చాలా త్వరగా పొందుతుంది మరియు అభివృద్ధి చేసుకుంటుంది అందువల్ల, ప్రతి స్ప్రేకు పురుగుమందులను మార్చి వాడండి._x000D_ • పురుగు సోకిన క్యాబేజీ తలలను సేకరించి నాశనం చేయండి._x000D_ • కోటేసియా ప్లూటెల్లే ఒక పరాన్నజీవి ఇది డిబియ్యం ను 60% వరకు నాశనం చేస్తుంది. ఈ పరాన్నజీవి జనాభా ఎక్కువగా ఉంటే పురుగుమందుల వాడకాన్ని నివారించండి లేదా ఆలస్యం చేయండి._x000D_ • అధిక ముట్టడిపై, క్లోర్‌పైరిఫోస్ 20 ఇసి @ 20 మి.లీ లేదా సైపర్‌మెథ్రిన్ 10 ఇసి @ 10 మి.లీ లేదా ఫెన్వాలరేట్ 20 ఇసి @ 5 మి.లీ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సీ @ 3 మి.లీ లేదా క్లోర్‌ఫెన్పైర్ 10 ఇసి @ 10 మి.లీ లేదా సయాంట్రానిలిప్రోల్ 10 ఓడి @ 3 మి.లీ లేదా డయాఫెంటియురాన్ 50 డబ్ల్యుపి @ 10 గ్రాములు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్జి @ 3 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 5 ఎస్సి @ 10 మి.లీ లేదా ఫ్లూబెండమైడ్ 20 డబ్ల్యుజి @ 2 గ్రా లేదా ఫ్లూబెండమైడ్ 480 ఎస్సి @ 3 మి.లీ లేదా ఇండోక్సాకార్బ్ 15.8 ఇసి 5 మి.లీ లేదా నోవాల్యూరాన్ 10 ఇసి @ 10 మి.లీ లేదా థియోడికార్బ్ 75 డబ్ల్యుపి @ 10 గ్రాములు లేదా టోల్ఫెన్పైరాడ్ 15 ఇసి @ 10 మి.లీ లేదా క్లోర్‌ఫ్లూయాజురాన్ 5.4 ఇసి @ 10 మి.లీ లేదా పిరిడియల్ 10 ఇసి @ 10 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. _x000D_ డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
122
1
ఇతర వ్యాసాలు