AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
స్మార్ట్ ఫార్మింగ్ఫిర్మ్స్ మీడియా
కోత తర్వాత పండ్ల నిర్వహణ మరియు సంరక్షణ
ఈ ప్రక్రియ డీసాపింగ్ తో మొదలవుతుంది. ఇది రెండు విధాలుగా చేయవచ్చు. 1. మామిడి పండ్లను సున్నం నీటి ద్రావణంలో ముంచడం. 2. పండు కాడని తొలగించి, మామిడి పండ్లను తలక్రిందులుగా ర్యాక్‌లో ఉంచడం. సున్నం నీటిలో ముంచిన తరువాత మామిడి పండ్లను నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత మామిడి పండ్లను క్రమబద్ధీకరించడం జరుగుతుంది, ఈ ప్రక్రియలో మచ్చలు ఉన్న పండ్లు, దెబ్బతిన్న పండ్లను తొలగించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సాధారణంగా మంచి నాణ్యమైన పండ్ల నుండి పాడైపోయిన పండ్లను తొలగించడం కోసం జరుగుతుంది. దీని తరువాత, మామిడి పండ్ల మీద ఉన్నధూళి మరియు మలినాలను నైలాన్ బ్రష్లు మరియు అధిక పీడనం కలిగిన నీటి సహాయంతో తొలగిస్తారు. దీని తరువాత వేడి నీటితో పండ్లను శుద్ధి చేస్తారు. ఇది మామిడి పండ్లను వ్యాధుల నుండి రక్షిస్తుంది. తర్వాత మామిడి పండ్ల మీద ఉన్న తడిని ఆరబెట్టడం కోసం వేడి గాలి వచ్చే మెషిన్లోకి పండ్లను పంపిస్తారు. తర్వాత ఈ మామిడి పండ్లను గ్రేడ్ చేసి, దాని పరిమాణాల ప్రకారం పెట్టెల్లో పెట్టి ప్యాక్ చేస్తారు.
మూలం: ఫిర్మ్స్ మీడియా మరింత సమాచారం కోసం, ఈ వీడియో చూడటం మర్చిపోవద్దు, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
80
2