AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
కూరగాయల పంటలు వేయడానికి గాను నర్సరీని ఎలా పెంచాలో నేర్చుకోండి !!
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
కూరగాయల పంటలు వేయడానికి గాను నర్సరీని ఎలా పెంచాలో నేర్చుకోండి !!
"ప్రతి బెడ్ కు 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 150 గ్రాముల పొటాష్, 50 గ్రాముల యూరియా మరియు 30 గ్రాముల కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ ఇవ్వాలి దీని వల్ల ప్రారంభ దశలలో, మొక్కలు బాగా పెరుగుతాయి మరియు శిలీంధ్రాల నుండి మొక్కలు రక్షించబడతాయి. ఆ తరువాత, బెడ్ల మధ్య 5 సెంటీమీటర్లు దూరం ఉండేలా చూడండి, విత్తనాలను డిబ్లింగ్ పద్దతిలో విత్తుకోవాలి. విత్తనాలు 5 సెంటీమీటర్లు కంటే ఎక్కువ లోతులో విత్తకుండా జాగ్రత్త వహించండి. ఇలా చేయడం వల్ల విత్తనాల అంకురోత్పత్తికి ఎటువంటి ఆటంకం కలుగదు.
విత్తనం విత్తిన తరువాత, బెడ్ కు కాన్ లేదా పంపుతో నీళ్ళు పెట్టండి. వరద వలే నీటిపారుదలను అందించకూడదు. లేకపోతే, విత్తనాలు బెడ్ నుండి కొట్టుకుపోతాయి. బెడ్ పైన గోన సంచులను రెండు రోజులు పాటు ఉంచి దానిపై నీరు చల్లుకోండి. విత్తనాలు వేగంగా మరియు మంచిగా మొలకెత్తడానికి ఈ ప్రక్రియ సహాయపడుతుంది. అంకురోత్పత్తి తరువాత ప్రారంభ దశ నుండి అనేక తెగుళ్ళు మరియు వ్యాధులను నివారించడానికి కార్బెండజిమ్ @ 1 గ్రాము / లీటరుకు మరియు మాంకోజెబ్ @ 2 గ్రాములు / లీటరుకు, థియామెథోక్సామ్ 0.25 గ్రాములు / లీటరు నీటికి కలిపి ఈ పురుగుమందులను మొక్కల మీద పిచికారీ చేయాలి. అలాగే, మొక్కలు బలంగా పెరగడానికి మరియు బయోటిక్ మరియు అబియోటిక్ కారణాల వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకోవడానికి, పంట పెరుగుదలను మెరుగుపరిచేందుకు సిలికాన్ 1 మి.లీ / లీటరు నీటికి కలిపి మరియు దానితో పాటు చిలేటేడ్ కాల్షియం @ 10 గ్రాములు/పంపు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. పంట ఆధారంగా, ఉదాహరణకు, మిరియాలు, టొమాటో, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, విత్తనాలు 8-10 రోజులలో మొలకెత్తుతాయి. మార్పిడికి అనువైన మొక్కను ఎంచుకోవడం ముఖ్యం. ఉదాహరణకు మిరప -35 రోజులు, టొమాటో -25 రోజులు, మిరియాలు / పుచ్చకాయ -18 రోజులకు ప్రధాన పొలంలో నాటుకోవడానికి సిద్ధంగా ఉంటాయి . మంచి మరియు బలమైన పెరుగుదల మరియు ఉత్పత్తి కోసం మంచి నాణ్యమైన మొక్కలను ఎంచుకోవాలి. మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి"
164
0