AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
కాస్టర్ సెమిలూపర్ (దాసరి పురుగు) యొక్క జీవిత చక్రం:
కీటకాల జీవిత చక్రంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
కాస్టర్ సెమిలూపర్ (దాసరి పురుగు) యొక్క జీవిత చక్రం:
కాస్టర్ సెమీ లూపర్ (దాసరి పురుగు) నూనెగింజల పంటకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది జూలై నుండి సెప్టెంబర్ నెలలలో కాలానుగుణంగా సంభవిస్తుంది. ఇది అనేక విభిన్న జాతుల మొక్కలను ఆహారంగా తీసుకుంటుంది, ముఖ్యంగా ఆముదం పంటను ఆశిస్తుంది.
గుడ్లు:_x000D_ తల్లి పురుగు నీలం ఆకుపచ్చ రంగులో గుండ్రంగా ఉండే గుడ్లను 450 వరకు ఒక్కొక్కటిగా ఆకులపై పెడుతుంది. గుడ్లు ఆకుల రెండు వైపులా ఒకే విధంగా పెడుతుంది. అప్పుడే పెట్టిన గుడ్లు గుండ్రంగా, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి మరియు ఇవి 0.9 మిమీ విస్తీర్ణంలో ఉంటాయి. గుడ్లు 2 నుండి 5 రోజుల్లో పొదుగుతాయి._x000D_ _x000D_ లార్వా:_x000D_ కొత్తగా ఉద్బవించిన గొంగళి పురుగులు పసుపు ఆకుపచ్చ రంగులో లేత గోధుమ రంగు తల మరియు థొరాక్స్‌తో, 3.5 మిమీ పొడవు ఉంటాయి. పూర్తిగా పెరిగిన లార్వా బూడిద గోధుమ రంగులో ఉంటాయి మరియు 60 నుండి 70 మిమీ వరకు పొడవుగా ఉంటాయి. ఐదు విభిన్న లార్వా ఇన్‌స్టార్లు ఈ దశలో ఉంటాయి. లార్వా కాలం 12 నుండి 13 రోజుల వరకు ఉంటుంది. _x000D_ _x000D_ ప్యూపా:_x000D_ ప్యూపా ఎర్రటి గోధుమ రంగులో 0.25 అంగుళాల పొడవు ఉంటుంది. ప్యూపేషన్ మట్టిలో పడిపోయిన ఆకుల మధ్య లేదా కొన్నిసార్లు మొక్కపై ముడుచుకున్న ఆకుల మధ్య జరుగుతుంది. ప్యూపా కాలం 10 నుండి 27 రోజుల వరకు ఉంటుంది. _x000D_ _x000D_ వయోజన చిమ్మట:_x000D_ వయోజన చిమ్మట 5/8 వ అంగుళాల పొడవు, 2 అంగుళాల పొడవు ఉండే రెక్కలతో ఉంటుంది. ఫోర్వింగ్స్ గోధుమ-బూడిద రంగులో ఉంటాయి మరియు అంచుల దగ్గర నలుపు మరియు తెలుపు ప్రకాశవంతమైన మచ్చలతో వెనుక రెక్కలు బూడిద రంగులో ఉంటాయి. ప్యూపా నుండి ఉద్భవించిన 2 నుండి 5 రోజుల తరువాత తల్లి పురుగు గుడ్లు పెట్టడం ప్రారంభిస్తారు._x000D_ _x000D_ నష్టం యొక్క లక్షణాలు:_x000D_ • లార్వా ఆకులను తింటుంది మరియు కొన్నిసార్లు మొత్తం పంటను విచ్చిన్నం చేస్తుంది._x000D_ • ఆకులు విచ్చిన్నం అవుతాయి._x000D_ • పెద్ద లార్వా మొక్కను విపరీతంగా తింటాయి కాబట్టి ఇవి ఆశించిన మొక్కలలో కాండం మరియు ఆకుల యొక్క ఈనెలు మాత్రమే మిగిలి ఉంటాయి_x000D_ _x000D_ నిర్వహణ :_x000D_ • పురుగుల ముట్టడి ప్రారంభ దశలో గొంగళి పురుగులను చేతితో సేకరించి నాశనం చేయండి._x000D_ • వేప విత్తన సారం (NSKE) 4% గుడ్డు మరియు లార్వా ప్రారంభ దశతో మొక్క మీద పిచికారీ చేయండి._x000D_ • బర్డ్ పెర్చ్స్ (ఎకరాకు 10 చొప్పున ) వ్యవస్థాపించడం ద్వారా పురుగు సంభవం తగ్గించడంలో ఇవి సహాయపడతాయి._x000D_ • ఎకరానికి డైమెథోయేట్ 30.00% ఇసి @ 462 మి.లీ లేదా మలాథియాన్ 50.00% ఇసి @ 800 మి.లీ 200 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ _x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ _x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి._x000D_ _x000D_ _x000D_
64
3