సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
ఔషధ మరియు సుగంధద్రవ్య మొక్కలకు ఆశించే తెగుళ్ల గురించి తెలుసుకోండి
రైతులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఔషధ మరియు సుగంధద్రవ్య మొక్కలను సాగు చేయడం ప్రారంభించారు. అనగా ఇసాబ్గోల్, అసలియో (క్రెస్), కల్మెగ్, అశ్వగంధ, సఫేద్ ముస్లి, దోధి మొదలగునవి._x000D_ మొక్కల యొక్క ఏ దశలలోనైనా పంటను అనేక క్రిమి తెగుళ్ళు దెబ్బతీస్తాయి._x000D_ పేనుబంక: ఈ పురుగులు అభివృద్ధి చెందుతున్న కొమ్మలు మరియు ఆకుల ఉపరితలం క్రింద నుండి రసాన్ని పీలుస్తాయి. ఇవి మొక్క యొక్క కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇసాబ్గోల్ పంటకు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. _x000D_ దోమ: పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండూ ఆకుల నుండి మరియు మొక్కల మృదువైన భాగాల నుండి రసాన్ని పీలుస్తాయి. తత్ఫలితంగా, ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి వంకరగా కప్పు ఆకారంలో కనిపిస్తాయి._x000D_ తెల్ల దోమ: పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండూ ఆకుల నుండి రసాన్ని పీలుసాయి._x000D_ తామర పురుగులు: ఈ కీటకాలు ఆకు ఉపరితలాన్ని గీకి, ఆకు నుండి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకు ఉపరితలం మీద నల్లటి చారలు ఏర్పడుతాయి. ఆకులు మందంగా మారుతాయి. రొండు నీటిపారుదల మధ్య కాలం ఎక్కువగా ఉన్నట్లయితే వీటి జనాభా పెరుగుతుంది._x000D_ నల్లి పురుగులు: ఇవి ఆకుల దిగువ ఉపరితలం మీద ఉండి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. కారణంగా ఆకులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఆకులు అనారోగ్యంగా కనిపిస్తాయి మరియు మొక్కల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి._x000D_ పిండి నల్లి: ఆకులు, రెమ్మలు, మొగ్గలు, పువ్వులు, కాయలు మరియు కాండం యొక్క ఉపరితలం నుండి ఇవి రసాన్ని పీలుస్తాయి. అందుచేత ఆకులు వంకరగా మారుతాయి. _x000D_ సిల్లా: కొత్తగా ఉద్భవించిన ఆకులు, మొగ్గలు మరియు లేత రెమ్మల నుండి పురుగులు రసాన్ని పీలుస్తాయి. తత్ఫలితంగా, పురుగు ఆశించిన భాగాలు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి._x000D_ డైమండ్ బ్యాక్ చిమ్మట: లార్వా అసాలియో వంటి ఔషధ మొక్కలను తిని పంటను పాడు చేస్తుంది._x000D_ హెలికోవర్పా: ఈ గొంగళి పురుగు వల్ల కలిగే నష్టాన్ని ఔషధ మొక్కలో ఎక్కువగా చూడవచ్చు._x000D_ పాము పొడ పురుగు: ఉద్భవిస్తున్న లార్వా ఆకులోకి ప్రవేశించి లోపల తింటుంది.లార్వా ఆకుపై జిగ్‌జాగ్ గ్యాలరీలను తయారు చేసి ఆకును దెబ్బతీస్తుంది._x000D_ ఆకు తినే గొంగళి పురుగులు: గొంగళి పురుగులు ఆకులు, పువ్వులు మరియు అభివృద్ధి చెందుతున్న మొగ్గలను తింటాయి._x000D_ చెదపురుగులు: చెదపురుగులు మొక్కల యొక్క వేర్లను తింటాయి తత్ఫలితంగా మొక్కలు ఎండిపోతాయి._x000D_ కాటోప్సిల్లా: ఈ పురుగు యొక్క గొంగళి పురుగులు ఎక్కువగా ఔషధ పంట అయిన సెన్నాకు హాని కలిగిస్తాయి._x000D_ అటువంటి క్రిమి తెగుళ్ల నియంత్రణ కోసం, బొటానికల్ లేదా బయోపెస్టిసైడ్స్‌ను పిచికారీ చేయండి._x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేళ్లు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులతో దీనిని షేర్ చేయండి. _x000D_
11
0
ఇతర వ్యాసాలు