AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ఉద్యాన వన శాస్త్రంఅన్నధాత కార్యక్రమం
ఉసిరి మరియు జామకాయ మొక్కలను తోటలో ఎలా నాటాలి!
ఏప్రిల్ మరియు మే నెలలో మొక్కలను నాటుకోవాలి. ఉసిరి మరియు జామకాయ మొక్కలు నాటడం కోసం 1 * 1 * 1 మీటర్ విస్తీర్ణంలో గుంటలు తీయాలి. మొక్కల మధ్య 6 * 6 మీటర్ల దూరం ఉండాలి. గుంటలు తవ్విన తరువాత వాటిని ఒకటి నుండి ఒకటిన్నర నెలల వరకు తెరిచి ఉంచండి, ఇలా చేయడం వల్ల వ్యాధి కారక శిలీంద్రాలు మరియు తెగుళ్లు నాశనం అవుతాయి. దీని తరువాత, బాగా కుళ్ళిన ఆవు పేడ 30 కిలోలు, 2 కిలోల ఎస్‌ఎస్‌పి, 1 కిలో ఎంఓపి, బోరాన్‌ 50 గ్రాములు మొదలైనవి బాగా కలిపి గుంటలలో నింపాలి. వర్షాలు ప్రారంభమయ్యే ముందు మొక్కలను నాటాలి.
మూలం: అన్నధాత ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
85
0