AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పంటలో సమగ్ర సస్య రక్షణ
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పంటలో సమగ్ర సస్య రక్షణ
ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పంట నుండి మంచి దిగుబడిని పొందడానికి పంటకు నష్టం కలిగించే వ్యాధులు మరియు తెగుళ్ళను నివారించడం అవసరం. ఆర్థిక నష్టాన్ని కలిగించే కొన్ని హానికరమైన తెగుళ్ళు మరియు వ్యాధులు ఉన్నాయి, ఇవి పంటకు అధిక నష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి తెగుళ్ళను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాసంలో, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పంటలో సమగ్ర సస్య రక్షణ విధానాల ద్వారా వ్యాధులు మరియు తెగుళ్ళను ఎలా నివారించాలో వివరంగా తెలియజేయడమైనది._x000D_ ప్రధాన తెగుళ్ళు_x000D_ తామర పురుగులు: _x000D_ ఇవి చిన్నగా మరియు పసుపు రంగులో ఉండే కీటకాలు, ఇవి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకు యొక్క రంగు పెళుసుగా కనిపిస్తుంది. ఈ పురుగుల వ్యాప్తి కారణంగా, ఆకుల కొన గోధుమ రంగులోకి మారి వాడిపోతుంది._x000D_ నిర్వహణ:_x000D_ • ఈ తెగులును నియంత్రించడానికి, ఫిప్రోనిల్ 5% ఎస్సి @ 400 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి మరియు ఈ ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ వేరు పురుగు:_x000D_ నిర్వహణ:_x000D_ • పొలంలో తాజా పేడను ఎరువుగా ఉపయోగించవద్దు_x000D_ • వేరు పురుగు నియంత్రణ కోసం, పురుగు ప్రభావిత పొలాల్లో వేర్ల దగ్గర ఎకరానికి క్లోర్‌పైరిఫోస్ 20% ఇసి @ 500 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. ఇలా చేయడం వల్ల మందు 3-4 అంగుళాలు మట్టి లోపలి వెళ్తుంది._x000D_ • కార్బోఫ్యూరాన్ 3% సిజి @ 13 కిలోలు పొలానికి నీరు పెట్టిన తరువాత ఇవ్వాలి. _x000D_ ప్రధాన వ్యాధులు:_x000D_ పర్పుల్ బ్లాచ్:_x000D_ ప్రారంభంలో, ఈ వ్యాధి ప్రభావం వల్ల, ఆకులు మరియు కాండం మీద తెలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి, దీని కారణంగా కాండం మరియు ఆకు బలహీనంగా అవుతుంది. ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది._x000D_ నిర్వహణ:_x000D_ ● మాంకోజెబ్ 64% + మెటలాక్సిల్ 4% @ 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి._x000D_ బ్లయిట్:_x000D_ ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్న సందర్భంలో, లేత నారింజ రంగు మచ్చలు ఆకుల ఉపరితలంపై కనిపిస్తాయి._x000D_ నిర్వహణ:_x000D_ • మాంకోజెబ్ 75% డబుల్ల్యుపి @ 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి రెండుసార్లు 10 నుండి 15 రోజుల వ్యవధిలో మొక్కల మీద పిచికారీ చేయండి._x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఎక్సలెన్స్_x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి._x000D_
637
0