AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
అలసందలు, పేసర్లు మరియు మినుములు లో మచ్చల పురుగు నిర్వహణ
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
అలసందలు, పేసర్లు మరియు మినుములు లో మచ్చల పురుగు నిర్వహణ
అలసందలు, పేసర్లు మరియు మినుముల పంటలలో పునరుత్పత్తి దశ (పుష్పించే దశ లేదా కాయ ఏర్పడే దశ) ఉంటుంది. సాధారణంగా, ఈ పంటలలో మచ్చల పురుగు యొక్క ముట్టడి ఈ దశలో గమనించవచ్చు. కాయ మీద రంధ్రం చేసి పురుగు కాయలోకి ప్రవేశిస్తుంది. పురుగు తిన్న విత్తనం పెరగదు మరియు కాయలలో కనిపించదు. ఈ పురుగు నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టనప్పుడు ఆర్థిక నష్టం కలుగుతుంది. పురుగు ఆకుపచ్చ రంగులో మరియు శరీరంపై నల్లటి వెంట్రుకలు కలిగి ఉంటుంది. పూర్తిగా పెరిగిన గొంగళి పురుగు తెలుపు వర్ణం కలిగి మరియు శరీరంపై 6 వరుసల నల్ల మచ్చలతో మెరుస్తూ ఉంటుంది, అందుకే దీనిని “మచ్చల పురుగు” అని పిలుస్తారు. పురుగు పువ్వులు, మొగ్గలు మరియు కాయల లోపల విత్తనాలను తింటుంది. రంధ్రం దగ్గర పురుగు విసర్జితములు కనిపిస్తాయి. అధిక తేమతో కూడిన వాతావరణ పరిస్థితులలో తీవ్రమైన నష్టం గమనించవచ్చు. ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్: • బ్రాకోనిడ్ కుటుంబానికి చెందిన రెండు పరాన్నజీవులు మచ్చల పురుగును నాశనం చేస్తాయి మరియు సహజంగా ఇవి పురుగు యొక్క సంఖ్యను తగ్గిస్తాయి. • పురుగు ముట్టడి ప్రారంభ దశలో ఉన్నప్పుడు, వేప విత్తన పొడి 500 గ్రా (5%) లేదా వేప నూనె @ 50 మి.లీ లేదా వేప ఆధారిత సూత్రీకరణలు 10 మి.లీ (1% ఇసి) నుండి 40 మి.లీ (0.15% ఇసి) లేదా బొవేరియా బస్సియానా, ఫంగస్ బేస్ పౌడర్ @ 40 గ్రా 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి .• ముట్టడి ఎక్కువగా ఉన్నట్లయితే , క్వినాల్ఫోస్ 25 ఇసి @ 20 మి.లీ లేదా ట్రయాజోఫోస్ 40% + సైపర్‌మెత్రిన్ 4% (44%) ఇసి @ 10 మి.లీ లేదా లుఫెనురాన్ 5 ఇసి @ 10 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 36 ఎస్ ఎల్ @ 10 మి.లీ లేదా థియోడికార్బ్ 75 డబుల్ల్యు పి @ 10 గ్రాములు క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్ సి @ 3 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి . • మచ్చల పురుగు నియంత్రణ కోసం ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 డబ్ల్యుజి @ 5 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 480 ఎస్సి @ 2 మి.లీ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సీ @ 3 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. • అలసందలో కాయ తొలుచు పురుగును గమనించినట్లయితే, ఇండోక్సాకార్బ్ 14.5 ఎస్సి @ 3.5 మి.లీ లేదా స్పినోసాడ్ 45 ఎస్సీ @ 1.6 మి.లీ లేదా ఎమామాక్టిన్ బెంజోయేట్ 5 ఎస్జీ @ 3 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొదటి సారి 50% మొక్కలు పుష్పించేటప్పుడు మరియు 7 రోజుల తర్వాత రెండవ సారి మందును పిచికారీ చేయాలి. • పేసర్లలో ఈ పురుగును గమనించినప్పుడు, 50% మొక్కలు పుష్పించే సమయంలో 10 లీటర్ల నీటికి క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సీ @ 3 మి.లీ లేదా ఫ్లూబెండియమైడ్ 480 ఎస్సీ @ 2 మి.లీ కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.
డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
194
0