AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
ఉద్యాన వన శాస్త్రంఅన్నధాత కార్యక్రమం
అరటి పంట నిర్వహణ పద్ధతులు:
మంచి నాణ్యమైన అరటి పండ్లను పొందటానికి గాను పంట నిర్వహణ అవసరం. వేసవిలో, నీటిని దృష్టిలో ఉంచుకుని సరైన నిర్వహణ పద్ధతులు చేపట్టండి. కలుపు మొక్కలను క్రమానుగతంగా పొలం నుండి తొలగించి నాశనం చేయండి. అరటి తోటలలో బిందు సేద్యం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కలుపు మొక్కల సంఖ్యను తగ్గిస్తుంది. బిందు సేద్యం పద్దతిలో మొక్కలకు తగినంత నీరు అందుతుంది మరియు నీటి కొరత ఉండదు. ప్రధాన మొక్కల దగ్గర కొత్త మొక్కలు పెరుగుతాయి. వాటిలో ఒకటి మినహా అన్ని మొక్కలను తొలగించండి. దీని వల్ల అరటి కాయ బాగా పెరుగుతుంది. అరటి గెల వేసిన సమయంలో నెలకు ఒక మొక్కకు 25 కిలోల ఆవు పేడ, 100 గ్రాముల పొటాష్, 200 గ్రాముల యూరియా వంటి ఎరువులు ఇవ్వాలి.
మూలం: అన్నధాత ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
94
8