AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
వేరుశనగ పంటలో ఆకు తినే గొంగళి పురుగుల నియంత్రణ
గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వేరుశనగ పంటలో ఆకు తినే గొంగళి పురుగుల నియంత్రణ
ఆకు తినే గొంగళి పురుగును రైతులు కత్తెర పురుగు మరియు పొగాకు లద్దె పురుగు అని కూడా పిలుస్తారు. వెచ్చని వాతావరణ పరిస్థితులలో ఈ పురుగుల ముట్టడి ఎక్కువ కాలం కొనసాగుతుంది. పిల్ల గొంగళి పురుగు ఆకుల మీద ఉన్న పత్ర హరితాన్ని ( క్లోరోఫిల్) మరియు మొక్క యొక్క లేత కొమ్మలను గీకి తింటుంది, పెద్ద పురుగు ఆకును పూర్తిగా తినివేసి ఆకులను విక్షేపం చేస్తుంది. పగటిపూట, గొంగళి పురుగులు మట్టిలో దాక్కుంటాయి మరియు రాత్రి వేళల్లో విపరీతంగా ఆహారం తింటాయి. ఇవి పువ్వులను మరియు కొన్నిసార్లు నేలలో పెరుగుతున్న కాయలను కూడా తింటాయి. పంటపై గొంగళి పురుగుల సంఖ్య సాధారణంగా ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో ఎక్కువగా ఉంటుంది. నిర్వహణ: • ఎకరానికి 1-15 లింగాకర్షణ ఉచ్చులను ఏర్పాటు చేయండి. • తెగులు సోకిన ప్రారంభ దశలో, 10 లీటర్ల నీటికి వేప విత్తన సారం @ 500 మి.లీ (5%) లేదా వేప ఆధారిత సూత్రీకరణ @ 40 మి.లీ కలిపి పిచికారీ చేయండి. • ఫంగల్ ఆధారిత పౌడర్ బౌవేరియా బస్సియానా ను @ 40 గ్రా లేదా బ్యాక్టీరియా ఆధారిత పొడి బాసిల్లస్ తురింగియెన్సిస్ 10 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయండి. • హెక్టారుకు న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ (ఎన్‌పివి) 250 LE (ఆకు తినే గొంగళి పురుగు నియంత్రణ కోసం) నుండి 450 LE (కాయ తొలుచు పురుగు నియంత్రణ కొరకు) పిచికారీ చేయండి. • ఆకు తినే గొంగళి పురుగు అధిక ముట్టడిపై, 10 లీటర్ల నీటికి మెథొమైల్ 50 WP @ 12.5 గ్రాములు కలిపి పిచికారీ చేయండి. • పురుగుమందుల సామర్థ్యాన్ని పెంచడానికి పురుగుమందుల ద్రావణంలో బెల్లంను జోడించవచ్చు.
డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
261
2