AgroStar
అన్ని పంటలు
క్రిషి జ్ఞాన్
సాగుపై చర్చలు
వ్యవసాయ దుకాణం
సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు
సేంద్రీయ వ్యవసాయంకృషి జీవన్
సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు
విత్తన శుద్ధి: సేంద్రీయ వ్యవసాయం క్రింద, విత్తనాలకు బయో ఎరువులతో విత్తన శుద్ధి చేయండి. పప్పుధాన్యాల పంటల కోసం అనగా పేసర్లు, మినుములు, చిక్కుడు, శనగ మొదలైన పంటలకు రైజోబియం మరియు తృణధాన్యాల పంటలకు అజటోబాక్టర్ / అజోస్పిరిల్లమ్ తో విత్తన శుద్ధి చేయాలి. మట్టిలో భాస్వరం అందుబాటులో ఉంచడానికి పిఎస్బి కల్చర్ని ఉపయోగించండి. హెక్టారుకు 3 ప్యాకెట్ల కల్చర్ని ఉపయోగించండి. 1 - 2 లీటర్ల నీటిలో 200 - 300 గ్రాముల బెల్లం కలపండి, అందులో 3 ప్యాకెట్ల కల్చర్ వేయండి. తయారుచేసిన ద్రావణం విత్తనాలపై చల్లి విత్తనాలకు బాగా పట్టేలా కలపాలి, తరువాత వాటిని నీడలో ఆరబెట్టండి. పొలానికి ఇచ్చే విధానం - విత్తనాలు విత్తే ముందు, పొలాన్ని దున్నడానికి ముందు ట్రైకోడెర్మా కల్చర్ను కలపాలి. ఇందుకోసం 500 కిలోల ఆవు పేడలో 2.5 కిలోల ట్రైకోడెర్మా పౌడర్ను కలిపి 10-15 రోజులు నీడలో ఉంచండి. విత్తనాలు విత్తే సమయంలో తయారుచేసిన కల్చర్ మిశ్రమాన్ని హెక్టార్ భూమిలో వేసి కలియదున్ని విత్తనాలను విత్తుకోండి. చెదపురుగుల నివారణకు, చివరిసారి పొలాన్ని దున్నుతున్న సమయంలో బిగాకు 125 కిలోల ఆముదం చెక్క లేదా 150 కిలోల వేప చక్క పొలానికి ఇవ్వండి. పొలంలో ఆముదం చెక్క కుళ్లడానికి ఆలస్యం అవుతుంది, కాబట్టి పొలంలో వేయడానికి అరగంట ముందు నీటితో తడిపి మరియు ఆ తరువాత దానిని పారో లేదా కఠినమైన వస్తువుతో మెత్తగా చేయండి తర్వాత పొలానికి పొడి రూపంలో ఇవ్వండి. మూలం: - కృషి జీవన్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి.
84
1