సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
ఎగుమతి నాణ్యత గల జెర్బెరా పూల సాగు విధానం
ఒక చిన్న ప్రాంతంలో లేదా పొలంలో మరియు పొలం చుట్టుపక్కల పండించిన పంటను ఎర పంటగా పిలుస్తారు మరియు ప్రధాన పంట యొక్క తెగులు ఆధారంగా ఎర పంటను ఎంచుకోవాలి . అదనపు ఆధాయం కోసం ఎర పంటను పండించడం లేదు. తల్లి పురుగులు ప్రధాన పంటతో పోలిస్తే ఎర పంటపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడుతాయి. ఎర పంటను పెంచడం ద్వారా మరియు మిత్ర పురుగుల జనాభాను పెంచడం ద్వారా తెగులు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు. ఎర పంటల వాస్తవాలు: • క్యాబేజీ పొలం చుట్టూ మరియు ప్రతి 25 వరుసలకు ఆవాలు విత్తడం చేయాలి. క్యాబేజీ పంటను ఆశించే తెగులు, అనగా క్యాబేజి రెక్కల పురుగు, క్యాబేజీతో పోలిస్తే ఆవల మొక్కపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడుతుంది. ఎర పంటలను నాటడం ద్వారా ఈ తెగులు వల్ల కలిగే నష్టం తగ్గుతుంది. అదనంగా, పేనుబంక సంఖ్య కూడా తగ్గుతుంది. • టమాటో మరియు ప్రత్తి పంటలో ప్రతి 10 వరసల మొక్కలకు బంతి మొక్కలు నాటండి ; కాయ తొలుచు పురుగులు ప్రధాన పంట మీద కంటే బంతి పువ్వులపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడతాయి . పూర్తిగా వికసించిన బంతి పువ్వులను నియమిత కాలంలో తరచుగా కోయాలి. • ప్రత్తి, వేరుశనగ మరియు పొగాకు లాంటి పంటలు ఆకు తినే గొంగళి పురుగుల బారిన పడకుండా ఉండటానికి ఆముదము మొక్కలను పొలంలో మరియు పొలం చుట్టూ ఎర పంటగా పెంచండి. గుడ్లు ఉన్న ఆముదం ఆకులను క్రమానుగతంగా సేకరించి నాశనం చేయండి. బంతి మొక్కలను పాము పొడ పురుగుకు ఎరగా టమాటో పొలంలో మరియు పొలం చుట్టూ నాటండి. • టమోటా మొక్కలను నిమ్మ పంటలో పాము పొడ పురుగుకు ఎర పంటగా పెంచి తెగులును నిర్వహించండి. • మొక్కజొన్న పంటలను ఆశించే హానికరమైన కత్తెర పురుగుకు నేపియర్ గడ్డిని ఒక ఎర పంటగా పరిగణిస్తారు; అది పొలం చుట్టూ పెంచాలి. • వెంట్రుకల గొంగళి పురుగుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి వేరుశనగ, సోయాబీన్, అలసంద పంటల చుట్టూ జనుము పంటను పెంచండి. • క్యాబేజీ పంటకు నష్టం కలిగించే ఫ్లియా బీటిల్ కోసం ముల్లంగిని ఎర పంటగా వేయండి . ముఖ్యమైన అంశాలు: • ఎర పంటను ప్రధాన పంటతో పాటు లేదా అంతకు ముందే వేయాలి . • ఎర పంటపై ఎలాంటి పురుగుమందులను పిచికారీ చేయవద్దు. • పొలంలో ఎర పంటను రక్షించడానికి సరైన వ్యవసాయ పద్ధతులను నిర్వహించండి. రెఫరెన్స్: ಅಗ್ರೋಸ್ಟಾರ್ ಅಗ್ರೋನೋಮಿ ಸೆಂಟರ್ ಆಫ್ ಎಕ್ಸೆಲೆನ್ಸ್
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
205
0
సంబంధిత వ్యాసాలు