గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
దానిమ్మ కాయ తొలుచు పురుగు (డ్యూడోరిక్స్ ఐసోక్రేట్స్)
మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో దానిమ్మ పండ్లను సాగు చేస్తారు. వీటిలో, అధికంగా దానిమ్మ పండ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి. ఈ పంటను భారతదేశంలో సగటున 109.2 వేల హెక్టార్లలో సాగు చేస్తారు. పండ్ల తోటలో, దానిమ్మ పంటను ఎక్కువగా కాయ తొలుచు పురుగు, బెరడు తినే గొంగళి పురుగు, పండ్లను పీల్చే చిమ్మట, పిండినల్లి, తామర పురుగులు దెబ్బతీస్తాయి. అదనంగా, కొన్నిసార్లు, చిలుకలు మరియు ఉడుతలు కూడా పండ్ల అభివృద్ధికి నష్టం కలిగిస్తాయి. కాయ తొలుచు పురుగు మాత్రమే 50% కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది.
దానిమ్మ కాయ తొలుచు పురుగును అనార్ బటర్ఫ్లై అని కూడా అంటారు. సీతాకోకచిలుకలు పండ్లు లేదా మొగ్గలు లేదా చిన్న పండ్ల కాడల మీద గుడ్లు పెడతాయి. ఉద్భవిస్తున్న పురుగు పండుపై రంధ్రం చేసి లోపలికి ప్రవేశించి, అభివృద్ధి చెందుతున్న కాయలను తింటుంది. పురుగు చేసిన రంధ్రం ద్వారా ఫంగస్ మరియు బ్యాక్టీరియా పండ్లలోకి ప్రవేశిస్తుంది అందువల్ల అవి కుళ్ళిపోతాయి. పురుగు సోకిన పండ్ల నుండి దుర్వాసన వస్తుంది. పండ్లు రాలిపోవడం మరియు పండ్ల నాణ్యత క్షీణించడం వల్ల ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దానిమ్మతో పాటు, ఈ తెగులు ఉసిరి, లిట్చి, పీచ్, ఆపిల్, రేగు పండు, జామకాయ మరియు సపోటాకు కూడా హాని కలిగిస్తుంది._x000D_ _x000D_ సమగ్ర సస్య రక్షణ (ఐపియం):_x000D_ • కొత్త తోటల పెంపకంలో, ధోల్కా, కాశ్మీరీ లోకల్, బెడానా వంటి తక్కువగా పురుగు ఆశించే అవకాశం ఉన్న రకాలను ఎంచుకోండి._x000D_ • కలుపు మొక్కలను తొలగించడం ద్వారా పండ్ల తోటను శుభ్రంగా ఉంచండి._x000D_ • తోటలో ఒక దీపపు ఎరను ఏర్పాటు చేయాలి._x000D_ • రంధ్రం ఉన్న పండ్లను సేకరించి నాశనం చేయండి._x000D_ • పడిపోయిన పండ్లను క్రమానుగతంగా సేకరించి నాశనం చేయండి._x000D_ • పండు నిమ్మకాయ పరిమాణాన్ని పొందినప్పుడు 30-50 రోజులలో కాగితం లేదా వెన్న కాగితమును కోన్ ఆకారపు టోపీ లాగా లేదా కాగితపు సంచులను ఉంచడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు._x000D_ • గుడ్డు పరాన్నజీవి ట్రైకోగ్రామ్మ @ 1 లక్ష ఎకరానికి 2 - 3 సార్లు విడుదల చేయాలి. ఈ తెగులు యొక్క గుడ్లను పరాన్నజీవి నాశనం చేస్తుంది. _x000D_ • ముట్టడి ప్రారంభ దశలో, వేప విత్తన పొడి 500 గ్రా (5%) ఎకరానికి లేదా వేప ఆధారిత పురుగుమందులను @ 10 మి.లీ (1% ఇసి) నుండి 40 మి.లీ (0.15% ఇసి) 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. _x000D_ • బాసిల్లస్ తురింజెన్సిస్ అనే బాక్టీరియా ఆధారిత పొడి @ 15 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి._x000D_ • ముట్టడి అధికంగా ఉన్నప్పుడు, పరిపక్వానికి వచ్చిన పండ్లను కోసిన తరువాత సిఫార్సు చేసిన పురుగుమందును పిచికారీ చేయండి. డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
202
1
సంబంధిత వ్యాసాలు