సేంద్రీయ వ్యవసాయంఅద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
తెగులు నియంత్రణ కోసం వేప సారం తయారీ విధానం
పంటలలో తెగులు నియంత్రణ కోసం వేప సారం అతి తక్కువ ధర కలిగిన పురుగుమందు. కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, ప్రత్తి మరియు ఇతర పంటలలో దీనిని పురుగుమందుగా ఉపయోగిస్తారు. వేప సారం తయారీ విధానం: వేప గింజలను సేకరించి లేదా ఇవి అందుబాటులో లేకపోతే, మార్కెట్లో లభించే వేప పొడి ఉపయోగించి , వేప సారం తయారు చేయవచ్చు. 5 కిలోల వేపపొడిని 10 లీటర్ల నీటిలో రాత్రిపూట ప్లాస్టిక్ బకెట్‌లో నానబెట్టి వేప సారం తయారుచేయాలి. రాత్రిపూట నానబెట్టిన వేప పొడి ద్రావణాన్ని జాగ్రత్తగా వడకట్టాలి. వేప సారం బాగా వడకట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి అందులో ఒక స్టిక్కర్ ను కలిపి మొక్క మీద పిచికారీ చేయాలి. వేప సారం యొక్క ప్రయోజనాలు: • వేప సారం సహజ వనరుల నుండి వచ్చినందున, ఇది ఆర్థికంగా ఉంటుంది మరియు తయారు చేయడం సులభం. • వేప సారం 15 రోజుల వ్యవధిలో ఉపయోగించడం వల్ల రసం పీల్చు పురుగుల ముట్టడి తగ్గుతుంది. • కీటకాలు మరియు చిమ్మటల కాల చక్రంలో, గుడ్లు మరియు రసం పీల్చు పురుగులు నివారించబడతాయి మరియు గుడ్లు పెట్టే సహజ ప్రక్రియ కూడా నిరోధించబడుతుంది. • దీనిని సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించడం చాలా సులభం ఎందుకంటే ఇందులో సహజ పదార్థాలు ఉంటాయి మరియు రసాయన పదార్థాలు ఉండవు. ఎగుమతి చేయాల్సిన కూరగాయల పంటలలో పిచికారీ చేయడం ప్రయోజనకరం. • పురుగుమందులతో పాటు సమగ్ర సస్య రక్షణ పద్ధతిలో దీనిని ఉపయోగించడం చాలా సులభం. • తెల్ల దోమ, పేను బంక, తామర పురుగు మరియు అనేక రకాల పురుగులు బాగా నియంత్రించబడతాయి; పురుగులు డింభక దశలో ఉన్నప్పుడు పంటలో వేప నూనె పిచికారీ చేయాలి. మూలం: శ్రీ. తుషార్ ఉగలే, వ్యవసాయ కీటక శాస్త్రవేత్త
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
516
1
సంబంధిత వ్యాసాలు