సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
ఆధునిక పద్ధతిలో చామంతి పూల సాగు
అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా మహారాష్ట్రలో దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సీజన్లో మరియు వివాహాల సమయంలో చామంతి పువ్వులకు మంచి డిమాండ్ ఉంటుంది. అందువల్ల ఈ పువ్వుల సాగు చాలా లాభదాయకం.
నేలలు:_x000D_ చామంతి పూల సాగుకు తగిన నేల ఎంపిక ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. మట్టి యొక్క ఉదజని సూచిక 6.5 నుండి 7 లోపు ఉండాలి. నీరు ఇంకే సారవంతమైన తేలిక నేలలు మరియు గరప నేలలు చామంతి పూల సాగుకు అనుకూలం. _x000D_ _x000D_ వాతావరణం:_x000D_ చామంతి తక్కువ పగటి సమయం అవసరమయ్యే మొక్క , ఇది పుష్పించడానికి తక్కువ పగటి సమయం ఉన్న రోజులు మరియు తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం. పెరుగుదల ప్రారంభ దశలో, అధిక పగటి సమయం మరియు సూర్యరశ్మి తప్పనిసరి. చామంతి మొక్క సాకీయవృద్ధికి 20°C నుండి 30°C మరియు పుష్పించడానికి 10°C నుండి 20°C అవసరం._x000D_ _x000D_ _x000D_ వెరైటీ ఎంపిక:_x000D_ ఎల్లప్పుడూ ఆ ప్రాంతంలో చామంతి పూల రకాలకు ఉన్న డిమాండ్ ఆధారంగా విత్తనాలను ఎంచుకోవాలి._x000D_ _x000D_ ఎరువుల నిర్వహణ:_x000D_ విత్తడానికి ముందు పొలం తయారుచేసేటప్పుడు, 10-12 టన్నుల బాగా కుళ్ళిన ఎరువును మట్టిలో వేసి కలియదున్నది. సాగు సమయంలో, ఎకరానికి 60:80:80 కిలోల నిష్పత్తిలో నత్రజని, భాస్వరం మరియు పోటాష్ ఇవ్వాలి, మరల నాటిన ఒకటి నుండి ఒకటిన్నర నెలలలో ఎకరానికి 5 కిలోలు చొప్పున ఇవ్వాలి._x000D_ _x000D_ ఇంటర్కల్చర్ ఆపరేషన్స్:_x000D_ పొలం నుండి ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగించాలి. కలుపులేని పొలం మంచి మరియు ఆరోగ్యకరమైన పంట పెరుగుదలను ఇస్తుంది. సాధారణంగా, మొక్క నాటిన నాలుగవ వారం తరువాత కలుపు తీయాలి. చామంతి మొక్క కొసలు మొగ్గతో సహా తుంచడం వల్ల పుష్పించే కొమ్మలు పెరిగి చామంతి పువ్వుల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. _x000D_ _x000D_ చామంతి పువ్వుల కోత:_x000D_ పూర్తి వికసించిన పువ్వులు సూర్యోదయానికి ముందు కోయాలి. పువ్వులు ఆలస్యంగా కొస్తే, పూల రంగు మరియు బరువు తగ్గుతుంది. రకాన్ని బట్టి, మొక్క నాటిన మూడు నుండి ఐదు నెలల తర్వాత పుష్పించడం ప్రారంభమవుతుంది, ఇది ఒక నెల పాటు ఉంటుంది. త్వరగా పూతకు వచ్చే రకాల నుండి నాలుగు మరియు ఆరు సార్లు, ఆలస్యంగా పూతకు వచ్చే రకాల నుండి ఎనిమిది మరియు పది సార్లు పూల కోత చేయవచ్చు. _x000D_ _x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
573
0
సంబంధిత వ్యాసాలు