గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వేరుశనగలో తెల్లపురుగు నిర్వహణ
పంటను తొలిచే మట్టి పురుగుల్లో తెల్ల పురుగు ముఖ్యమైనది, ఇది వేరుశనగకు తీవ్ర నష్టం కలుగజేస్తుంది. లార్వా దశలో కుళ్లిన కూరగాయలను ఆహారంగా తీసుకునే ఇవి తర్వాతి దశలో మూలాల దాకా వెళ్లి వేర్లను సైతం నాశనం చేస్తాయి. మొక్కలపై బాగా విస్తరించి వాటిని ఎండిపోయేలా చేయడంతో పాటు పీల్చి పిప్పి చేస్తాయి. దీనివల్ల పంటపై మచ్చలు పడటం మొక్కల మధ్య ఖాళీలు రావడంతో పాటు పంట క్షేత్రం మొత్తం దెబ్బతినే అవకాశముంది. అందుకే సరైన నిర్వహణ పద్ధతులను అనుసరించాలి:
నిర్వహణ: • పొలాల చుట్టూ ఉండే చెట్లను క్రమం తప్పకుండా కత్తిరిస్తూ ఉండాలి. • మొదటిసారి విస్తారంగా వర్షం కురిసిన తర్వాత, తుమ్మ, రేగి, మునగ మరియు వేప చెట్ల ఆకులపై పేడపురుగులు వృద్ధి చెందుతుంటాయి. కాబట్టి కొమ్మలను గట్టిగా ఊపడం ద్వారా వాటిని చెట్ల మీద నుంచి తొలగించడంతో పాటు నాశనం చేయవచ్చు. • క్వినాల్‌ఫాస్‌ 25ఈసీ@ 20మి.లీ. లను 10 లీటర్ల నీటిలో కలిపి పొలం చుట్టూ ఉన్న వివిధ చెట్లపై పిచికారి చేయాలి. • వేసవి కాలంలో వచ్చే వేడి కారణంగా ఈ పురుగుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. • కాంతి ఉచ్చులు పెట్టడం ద్వారా పేడ పురుగులను నాశనం చేయవచ్చు, కాంతి ఉచ్చులు వీటిని త్వరగా ఆకర్షిస్తాయి. • క్లోరోఫైరిఫోస్‌ 20 ఈసీ @ 25 మిల్లీ లేదా థియామెథోక్సామ్‌ 30 ఎఫ్‌ఎస్‌ @ 10 గ్రాములని కేజీ విత్తనాలలో కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఈ శుద్ధి చేసిన విత్తనాలను మూడు గంటల పాటు ఎండలో ఎండబెట్టిన తర్వాత విత్తాలి. • అలాగే బొవరియాబస్సినా లేదా మెటారిజిమానిసోపిలియా, ఫంగస్‌ బేస్‌ పొడి (5కేజీ/హెక్టార్‌)ని ఆముదం పొడి (300 కేజీ/ హెక్టార్‌)తో కలిపి విత్తే ముందు పట్టించాలి 30 రోజుల తర్వాత అవే పొడులని (40గ్రా/ 10 లీటర్ల నీటిలో కలిపి) చల్లాలి. • పంట ఎదిగిన తర్వాత, క్లోరోఫైరిఫాస్‌ 20 ఈసీ 4 లీటర్‌/ హెక్టార్‌ కలిపి బిందు సేద్యం పద్దతిలో చల్లాలి లేదా ఫోరేట్‌ 10 గ్రా @ 10కే జీ/హెక్టార్‌ కలిపి మట్టికి పట్టించాలి. డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
670
0
సంబంధిత వ్యాసాలు