సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
ఉల్లి నర్సరీ నిర్వహణ
• ఒక ఎకరా పొలంలో నాటడానికి గాను 2-4 గుంటల భూమిలో ఉల్లి నారు పోయాలి._x000D_ • ఉల్లిపాయ సాగు కోసం ఎంచుకున్న పొలం కలుపు రహితంగా మరియు సరైన నీటి పారుదల వ్యవస్థను కలిగి ఉండాలి._x000D_ • తగినంత సూర్యరశ్మి ఉన్న ప్రాంతంలో నర్సరీని పెంచాలి. కలుపు పెరుగుదల ఉన్నట్లయితే, నీరు పెట్టాక కలుపు తీయడం చేయాలి మరియు ఎరువు వేసిన తరువాత విత్తనాలను నాటాలి. నర్సరీ బెడ్ మీద విత్తనాలు విత్తాలి._x000D_ • మొలకల చుట్టూ నీరు నిలువకుండా ఉండటానికి నర్సరీ బెడ్ ఏకరీతిగా మరియు సమాంతరంగా ఉండేలా చూడాలి . ఇలా చేయడం వల్ల, మొలకలు కుళ్ళిపోవు._x000D_ • నర్సరీ బెడ్ 1 మీటర్ వెడల్పు, 3-4 మీటర్ల పొడవు మరియు 15 సెం.మీ ఎత్తు ఉండాలి._x000D_ • నర్సరీ బెడ్ కు ట్రైకోడెర్మా విరిడే మరియు బాగా కుళ్ళిన పశువుల ఎరువును కలిపి ఇవ్వండి.
• అంకురోత్పత్తి శాతం బాగా ఉంటే, ఒక ఎకరా పొలానికి గాను 2.5-3 కిలోల విత్తనం సరిపోతుంది._x000D_ • విత్తనాలను విత్తడానికి ముందు 2.5 నుండి 5 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా కార్బెండజిమ్‌తో విత్తన శుద్ధి చేయండి._x000D_ • అంకురోత్పత్తి బాగా జరగడానికి విత్తనం విత్తిన వెంటనే నీటిని అందించాలి తర్వాత 7 రోజులకు రెండవ సారి నీరు ఇవ్వాలి._x000D_ • కలుపు మొక్కలు ఉంటే కలుపును తీయాలి తర్వాత మట్టిని ఎగదోయాలి. మొక్కలు ప్రధాన పొలంలో నాటే 24 గంటల ముందు నీటిని అందించాలి. ఇలా చేయడం వల్ల , మొలకలని తీయడం సులభం అవుతుంది._x000D_ • 40 నుంచి 50 రోజులలో మొలకలు నాటడానికి సిద్ధం అవుతాయి. _x000D_ • మొలకలు ప్రధాన పొలంలో నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, తామర పురుగులు మరియు నారు కుళ్ళు తెగులు మొక్కను ఆశించే అవకాశం ఉంది. తామర పురుగులను నియంత్రించడానికి, క్వినోల్‌ఫోస్ 25 ఇసి @ 15 మి.లీ / పంపు నీటికి కలిపి పిచికారీ చేయండి, వేరు కుళ్ళు తెగులు సమస్యను నియంత్రించడానికి గాను మాంకోజెబ్ @ 25 గ్రా / 10 లీటర్ల నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి._x000D_ మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్_x000D_ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
439
1
సంబంధిత వ్యాసాలు