గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వేసవి కాలం వరి పంటలో దోమ నిర్వహణ
• ప్రధానంగా ఆకుపచ్చ దోమ, సుడి దోమ మరియు తెల్ల వీపు దోమ వేసవిలో పండించే వరి పంటని దెబ్బతీస్తాయి. • పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు రొండు మొక్క నుండి రసాన్ని పీలుస్తాయి. • దెబ్బతిన్న మొక్కలు గోధుమ లేదా పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. • పురుగు యొక్క ముట్టడి అధికంగా ఉన్నట్లయితే, మొక్క కాలిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే "హాప్పర్ బర్న్" అని పిలుస్తారు.
• వృత్తాకారంలో పురుగు ముట్టడి పెరుగుతుంది. • దెబ్బతిన్న మొక్కలపై ధాన్యాలు పరిపక్వం చెందకపోవచ్చు కావున ఇది ధాన్యం యొక్క దిగుబడిని ప్రభావితం చేస్తాయి. • ఈ పురుగులు వారంలోనే పొలం మొత్తాన్ని నాశనం చేస్తాయి • సిఫారస్సు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను వాడండి. • పురుగు యొక్క ముట్టడి గమనించినట్లయితే పొలంలో నీరు తీయండి. • ఫోరేట్ 10 జి (హెక్టారుకు 10 కిలోలు) లేదా కార్బోఫ్యూరాన్ 3 జి (హెక్టారుకు 20-25 కిలోలు) పొలానికి ఇవ్వడం ద్వారా దోమను నియంత్రించవచ్చు. • తరువాతి దశలో గుళికల రూపంలో ఉన్న పురుగుమందులను వాడటం సాధ్యం కాకపోతే, ఎసిఫేట్ 75 ఎస్పి @ 10 గ్రాములు లేదా క్లోథియానిడిన్ 50 డబుల్ల్యుజి @ 5 గ్రాములు లేదా డైనటోఫ్యూరాన్ 20 ఎస్జి @ 4 గ్రాములు లేదా ఇథోఫెన్ప్రాక్స్ 10 ఇసి 10 మి.లీ లేదా ఇథోఫెన్ప్రాక్స్ 10 ఇసి @ 10 మి.లీ లేదా ఫెనుబోకార్బ్ 50 ఇసి @ 20 మి.లీ లేదా పైమెట్రోజైన్ 50 డబుల్ల్యుజి @ 5 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. • నిరంతరం పొలాన్ని పర్యవేక్షించండి మరియు మొక్కలను పురుగుల నుండి రక్షించడానికి పురుగు ఆశించిన ప్రదేశంలో పురుగుమందును వాడండి. మూలం: అగ్రోస్టార్ అగ్రోనమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ రైతు స్నేహితులకు షేర్ చేయండి.
33
15
సంబంధిత వ్యాసాలు