గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
సోయాబీన్ పంటలో ఆకు తినే గొంగళి పురుగుల నిర్వహణ
పరిచయం: సోయాబీన్ ఒక ముఖ్యమైన ఆహార పంట మరియు దీనిని పప్పు దాన్యంగా మరియు నూనెగింజల పంటగా పరిగణిస్తారు. అయినప్పటికీ, ఇది పప్పు ధాన్యంగా కన్నా ఎక్కువగా నూనెగింజల పంటగా ఉపయోగించబడుతుంది. సోయాబీన్ లో ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వు కలిగి ఉంటుంది. సోయాబీన్లో 38-40% ప్రోటీన్, 22% నూనె, 21% కార్బోహైడ్రేట్ మరియు 12% తేమ ఉంటుంది. భారతదేశంలో, మధ్యప్రదేశ్ అధికంగా సోయాబీన్ ఉత్పత్తి చేసే రాష్ట్రం మరియు సోయాబీన్ రీసెర్చ్ సెంటర్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉంది. సోయాబీన్ పంటలో ఆకు తినే గొంగళి పురుగు పంటకు బాగా నష్టం కలిగిస్తుంది. వాటి గురించి మరింత తెలుసుకుందాం. • పొలం చుట్టూ ఆముదం మొక్కలను పెంచండి. ఆకు తినే గొంగళి పురుగు యొక్క తల్లి పురుగులు ఆముదం ఆకులపైన గుడ్లు పెట్టడానికి ఇష్టపడుతాయి • గుడ్డు ఉన్న ఆముదం ఆకులను సేకరించి నాశనం చేయండి. • హెక్టారుకు SLNPV ను 250 LE 500 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం సమయంలో పిచికారీ చేయండి. • బ్యాక్టీరియా ఆధారిత పొడి, బాసిల్లస్ తురింజెన్సిస్ @ 15 గ్రా లేదా ఒక ఫంగల్ ఆధారిత పొడి బౌవేరియా బస్సియానా @ 40 గ్రా 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయండి. • వేప విత్తన సారం 5% లేదా వేప ఆధారిత సూత్రీకరణలు @ 40 మి.లీ (0.15% ఇసి) 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. • అధిక ముట్టడి ఉన్న ఆకులపై, క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సీ @ 3 మి.లీ లేదా ప్రొఫెనోఫోస్ 50 ఇసి @ 10 మి.లీ లేదా క్లోరోపైరిఫోస్ 20 ఇసి @ 20 మి.లీ లేదా ఇండోక్సాకార్బ్ 15.8 ఇసి @ 10 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
274
1
సంబంధిత వ్యాసాలు