కీటకాల జీవిత చక్రంICAR-CISH, లక్నో.
మామిడి పంటలో కాండం తొలుచు పురుగు యొక్క జీవిత చక్రం
ఈ తెగులు మామిడి పంటను తక్కువగా ఆశించినప్పటికీ ఇది చేసే నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఆమ్లెట్ మరియు ముల్గోవాస్ అను రకం మామిడి మొక్కలకు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. అత్తి, రబ్బరు, పనసకాయ, యూకలిప్టస్ మొదలైన పంటలపై ఈ పురుగు దాడి చేస్తుంది. ఈ బీటిల్స్ జూలై-ఆగస్టులో ఉద్భవిస్తాయి. సెప్టెంబర్-అక్టోబర్ నెలలలో తక్కువ ఉష్ణోగ్రత మరియు తేమ ఉన్నప్పుడు ఈ పురుగు ముట్టడి ఎక్కువగా ఉంటుంది. జీవిత చక్రం: • తల్లి పురుగులు బెరడుపై గుడ్లను పెడతాయి మరియు వీటి జీవిత కాలం 7-13 రోజుల పాటు ఉంటుంది. • లార్వా మరియు ప్యూపా దశ 140–160 రోజుల పాటు ఉంటుంది. • సొరంగం లోపల ప్యూప తయారవడానికి 20-25 రోజులు పడుతుంది. • వయోజన పురుగులు 120 -270 రోజుల్లో ఉద్బవిస్తాయి. • సంవత్సరంలో ఒక తరం పురుగులు మాత్రమే వస్తాయి.
నిర్వహణ: _x000D_ • తోటలను శుభ్రంగా ఉంచండి._x000D_ • ఇనుప వైరు / హుక్ ఉపయోగించి పురుగు సోకిన కొమ్మ యొక్క రంధ్రాల నుండి పురుగులను తొలగించండి._x000D_ • ప్రభావిత కొమ్మలను కత్తిరించి నాశనం చేయండి._x000D_ • రంధ్రాలను శుభ్రం చేసి, 0.5% డైక్లోర్వోస్ 76 ఇసి @ 5 మి.లీ / లీటరు నీటికి కలిపి, ఈ ద్రావణంలో నానబెట్టిన ప్రత్తిని రంధ్రంలోకి పెట్టి, మట్టితో ఈ రంధ్రాలను మూసివేయండి._x000D_ మూలం: ICAR-CISH, లక్నో._x000D_ _x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. _x000D_ _x000D_
14
0
సంబంధిత వ్యాసాలు