సేంద్రీయ వ్యవసాయంఅగ్రోవన్
బ్యూవేరియా బస్సియానా యొక్క ప్రయోజనాలు మరియు దీని వినియోగాన్ని అర్థం చేసుకుందాం
ఈ ఫంగస్ పురుగును ఆశించిన వెంటనే పురుగు యొక్క చర్మం మీద ఫంగస్ యొక్క బీజాంశం పెరిగి, పురుగు శరీరంలో వ్యాప్తి చెందుతుంది. ఇది పురుగు శరీరమంతా ఫంగస్ వ్యాపించేలా చేస్తుంది మరియు పురుగు యొక్క శరీర పోషకాలను ఉపయోగించుకొని జీవిస్తుంది. ఫంగస్ ఆశించిన 48 నుండి 72 గంటలకు పురుగు చనిపోతుంది.
పంటలు: తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు_x000D_ టార్గెట్ పెస్ట్: పురుగు, వీవిల్ మరియు ఆకు తినే గొంగళి పురుగు_x000D_ ఉపయోగం: వైట్ గ్రబ్‌ (వేరు లద్దె పురుగు)ను నియంత్రించడానికి, బ్యూవేరియా బస్సియానా పొడిని మట్టిలో లేదా నీటిలో కలపి తర్వాత మొక్క యొక్క వేర్ల దగ్గర ఈ ద్రావణంతో తడిపివేయండి. పంట విత్తడానికి ముందు లేదా తరువాత, దానిని మట్టితో కలపవచ్చు లేదా డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు._x000D_ వినియోగ విధానం: పురుగు యొక్క సంఖ్యను లేదా పంటను బట్టి, ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి గ్రీన్హౌస్లలో పురుగు నిర్వహణకు ఉపయోగించవచ్చు._x000D_ మోతాదు: 200 లీటర్ల నీటిలో 2 కిలోల బ్యూవేరియా బస్సియానా పొడిని కలిపి మట్టి లేదా మొక్క మీద పిచికారీ చేయండి లేదా 5 గ్రాములు 1 లీటరు నీటిలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయండి. _x000D_ మూలం: అగ్రోవన్ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
185
1
సంబంధిత వ్యాసాలు