గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
కంది పంటలో కాయ తొలుచు పురుగు యొక్క సమగ్ర సస్య రక్షణ
భారతదేశంలో చాలావరకు ఉత్పత్తి అయ్యే పప్పు ధాన్యాల పంటలలో కంది పంట ఒకటి. మొక్కజొన్న లేదా ప్రత్తిలో అంతర పంటగా ఈ పంటను అనేక ప్రాంతాలలో సాగు చేస్తారు. పునరుత్పత్తి దశలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, వివిధ రకాల కాయ తొలుచు పురుగులు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. వివిధ రకాల కాయ తొలుచు పురుగులతో పాటు, పేనుబంక, చెదలు, పిండి నల్లి, దోమ, నల్లి, పాడ్ బగ్స్ మొదలైనవి కూడా ఈ పంటలో కనిపిస్తాయి. కాయ తొలుచు పురుగు, పాడ్ ఫ్లై, బులుగు సీతాకోకచిలుక, ప్లూమ్ మాత్, మచ్చల కాయ తొలుచు పురుగు మొక్క పుష్పించే సమయంలో మరియు కాయ ఏర్పడే దశలో అధికంగా నష్టాన్ని కలిగిస్తాయి. పాడ్ ఫ్లై మరియు కాయ తొలుచు పురుగు యొక్క ముట్టడి మధ్యకాలిక మరియు దీర్ఘ కాలిక రకాలలో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా, కాయ తొలుచు పురుగు జనాభా కాయలు గుత్తిగా వచ్చే రకాలలో ఎక్కువగా ఉంటుంది. కాయ తొలుచు పురుగు కాయకు రంధ్రం చేసి, కాయలోకి ప్రవేశించి అభివృద్ధి చెందుతున్న విత్తనాలను తింటుంది. పాడ్ ఫ్లై పురుగు కూడా కాయలోకి ప్రవేశించి లోపల తింటుంది. ప్రారంభంలో, ప్లూమ్ మాత్ పురుగు కాయ పైన పొరను గీరి, ఆపై విత్తనాలలోకి ప్రవేశించి విత్తనాలను తింటుంది. సమగ్ర సస్య రక్షణ చర్యలు: • ఈ పురుగులు కలుపు మొక్కల మీద జీవిస్తాయి కావున కలుపు మొక్కలను పొలం గట్లు మరియు సరిహద్దుల నుండి తీసి నాశనం చేయండి. • కాయ తొలుచు పురుగు జనాభా సాధారణంగా నాన్ బంచి (కొమ్మలపై అక్కడక్కడా కాయలు వచ్చే రకం) కంది రకాల్లో తక్కువగా ఉంటుంది. • మొక్కజొన్న పంటతో అంతర పంటగా పండించిన కంది పంటలో ఈ పురుగు ముట్టడి తక్కువగా ఉంటుంది. • పూత ప్రారంభ దశలో కాయ తొలుచు పురుగు (హెలికోవర్పా) కోసం 5 ఎరలు ఏర్పాటు చేయాలి మరియు తగినంత సంఖ్యలో పురుగులను గమనించినట్లయితే, మరిన్ని ఎరలను ఏర్పాటు చేయాలి. • విద్యుత్తు సౌకర్యం ఉన్నట్లయితే, పొలంలో ఒక దీపపు ఎరను ఏర్పాటు చేయాలి. • పురుగు ప్రారంభ దశలో, వేప విత్తన పొడి 500 గ్రాములు (5%) 10 లీటరు నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. • హెక్టారుకు HaNPV @ 250 LE చొప్పున పిచికారీ చేయండి. • బాసిల్లస్ తురింజెనెసిస్ (బిటి) పౌడర్ @ 15 గ్రాములు లేదా బౌవేరియా బస్సియానా అను ఫంగస్ బేస్ పౌడర్ @ 40 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. • పొలంలో ఎక్కువ సంఖ్యలో పక్షులను ఆకర్షించడానికి ప్రణాళిక సిద్ధం చేయండి. • 50% మొక్కలు పుష్పించేటప్పుడు, అస్ఫేట్ 75 ఎస్ పి @ 15 గ్రాములు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్జి @ 3 గ్రాములు లేదా ఇండోక్సాకార్బ్ 15.8 ఇసి @ 4 మి.లీ లేదా థియోడికార్బ్ 75 డబుల్ల్యు పి @ 20 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 ఎస్సి @ 3 మి.లీ లేదా ఫ్లూబెండియామైడ్ 480 ఎస్సి @ 3 మి.లీ లేదా స్పినోసాడ్ 45 ఎస్సి @ 4 మి.లీ లేదా డెల్టామెథ్రిన్ 1% + ట్రయాజోఫోస్ 35% ఇసి @ 10 మి.లీ లేదా ఫ్లూబెండియామైడ్ 20 డబుల్ల్యు జి @ 5 గ్రాములు లేదా క్లోర్‌పైరిఫోస్ 50% + సైపర్‌మెత్రిన్ 5% ఇసి @ 10 మి.లీ లేదా ప్రొఫెనోఫోస్ 40% +సైపర్‌మెథ్రిన్ 4% ఇసి @ 10 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి. ప్రతి స్ప్రేకు పురుగుమందును మార్చి వాడండి. • కూరగాయల కోసం సాగు చేసే కంది పంటలో మోనోక్రోటోఫాస్‌ను పిచికారీ చేయవద్దు.
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
81
1
సంబంధిత వ్యాసాలు