గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
మీరు లింగాకర్షణ ఉచ్చుల సంరక్షణ పద్ధతులను పాటిస్తున్నారా?
పంటకు నష్టాన్ని కలిగించే కీటకాలను నియంత్రించడానికి రైతులు తరచుగా పురుగుమందుల మీద ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో, పురుగుమందులు విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది మరియు ఇది ఆరోగ్యం మీద చెడు ప్రభావాలు చూపుతుంది. అందువల్ల అనేక మంది రైతులు సేంద్రీయ వ్యవసాయానికి మారారు మరియు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల వారి ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశం ఉంది. సేంద్రీయ వ్యవసాయంలో మాత్రమే కాకుండా, పంటల సాగులో కూడా లింగాకర్షణ బుట్టలను ఉపయోగించవచ్చు. లింగాకర్షణ బుట్టలు సమగ్ర సస్య రక్షణలో (ఐపిఎం) ముఖ్య పాత్ర పోషిస్తాయి మరియు ఇవి సాధారణంగా పురుగులను నియంత్రించడానికి మరియు వాటి జనాభాని అంచనా వేయడం కోసం ఉపయోగిస్తారు.
దీని గురించి మరింత తెలుసుకుందాం:_x000D_ 1. ఉచ్చులో అమర్చిన సెప్టా నుండి ఒకరకమైన వాసన విడులవుతుంది. లింగాకర్షణ ఉచ్చుల రకానికి సంబంధించిన నిర్దిష్ట మగ పురుగు ఉచ్చు వైపు ఆకర్షించబడి త్వరలోనే చనిపోతుంది. అందువల్ల, క్రమానుగతంగా మగ చిమ్మటల జనాభా తగ్గుతుంది మరియు ఆడ పురుగులు సంతానోత్పత్తి చేయని గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుండి లార్వాలు ఆవిర్భావం కావు. ఇలా చేయడం వల్ల మన పంటలను పురుగుల నుండి కాపాడుకోవచ్చు. _x000D_ 2. అమెరికన్ బోల్‌వార్మ్, మచ్చల పురుగు,గులాబీ రంగు పురుగు, డైమండ్‌ బ్యాక్ చిమ్మట, కాండం తొలుచు పురుగు, దాసరి పురుగు, పాము పొడ పురుగు, వంకాయ కాండం మరియు కాయ తొలుచు పురుగు, కొబ్బరి రెడ్ పామ్ వీవిల్, వేరు పురుగు, ఫ్రూట్ ఫ్లై వంటి అనేక రకాల పురుగులకు ఈ రకమైన లింగాకర్షణ బుట్టలు అందుబాటులో ఉన్నాయి. _x000D_ 3. ఫెరోమోన్ ఉచ్చులు చాలా నిర్దిష్టంగా ఉంటాయి మరియు సెప్టా లోపల ఉంచబడిన రసాయనాల ఆధారంగా ఫేర్మోన్ ఉచ్చులు మగ చిమ్మటను ఆకర్షిస్తాయి._x000D_ 4. ఒకే ఉచ్చులో వేర్వేరు పురుగుల ఎరలను ఉంచవద్దు. అవసరమైతే వేర్వేరు ఉచ్చులను వాడండి._x000D_ 5. పంట నుండి అర అడుగు లేదా ఒక అడుగు ఎత్తులో ఉచ్చును వ్యవస్థాపించండి. పంట ఎత్తు పెరిగేకొద్దీ, ఉచ్చుల ఎత్తును ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయండి._x000D_ 6. పొలంలోని రెండు ఉచ్చుల మధ్య 10 మీటర్ల దూరం ఉండేలా చూడండి._x000D_ 7. అంకురోత్పత్తి తర్వాత ఉచ్చులను వ్యవస్థాపించండి మరియు పంట పరిపక్వతకు వచ్చే వరకు వీటిని నిర్వహించండి._x000D_ 8. వ్యవస్థాపించిన తర్వాత తరచుగా వాటి స్థానాన్ని మార్చవద్దు._x000D_ 9. ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగుమందులను ఉచ్చులపై పిచికారీ చేయవద్దు._x000D_ 10. ఎరలను కనీసం నెలకు ఒకసారైనా మార్చండి. కొన్ని కీటకాలకు దీర్ఘకాలిక సెప్టా కూడా లభిస్తుంది._x000D_ 11. కొనుగోలు చేసిన ఎరలను చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. ప్యాకెట్లు తెలిచిన వెంటనే దాన్ని వాడండి._x000D_ 12. సాధారణంగా, సర్వే కోసం ఐదు ఉచ్చులు అవసరమవుతాయి, అయితే తెగులు నిర్వహణకు గాను హెక్టారుకు 25 నుండి 40 ఉచ్చులు అవసరమవుతాయి._x000D_ 13. సర్వే కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులలో, 5 లేదా 5 కంటే ఎక్కువ చిమ్మటలు 5-7 రోజుల పాటు చిక్కుకుంటే, పురుగు నియంత్రణ కోసం పురుగుమందులను పిచికారీ చేయడం మంచిది._x000D_ 14. వారానికి రొండుసార్లు ఉచ్చులో చిక్కుకున్న పురుగులను సేకరించి నాశనం చేయండి._x000D_ 15. కుక్కలు లేదా ఇతర జంతువులు ఉచ్చులను పాడు చేయకుండా జాగ్రత్త వహించండి._x000D_ 16. ఒక ప్రాంతంలోని రైతులందరూ ఒకే రకమైన ఉచ్చులను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది._x000D_ 17. మంచి నాణ్యమైన ఉచ్చులను పొందడానికి గాను ప్రసిద్ధ తయారీదారుల నుండి ఉచ్చులను కొనండి._x000D_ 18. మొక్కపై ఉచ్చును ఏర్పాటు చేయవద్దు , దీనిని చెక్క లేదా ఇనుప కడ్డీలపై ఉంచాలి._x000D_ 19. చెక్క కొమ్మలను ఉపయోగించినట్లయితే, చెదలు ఆశించకుండా జాగ్రత్త వహించండి._x000D_ 20. కొన్ని సంస్థలు లింగాకర్షణ ఉచ్చులను నీటి ఉచ్చుల రూపంలో అందిస్తాయి, ఉదాహరణకు వంకాయ కాండం మరియు కాయ తొలిచే పురుగులకు. అటువంటి పరిస్థితిలో, నీటి స్థాయిని క్రమానుగతంగా నిర్వహించండి._x000D_ _x000D_ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బ్రొటనవేళ్లు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇవ్వబడిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులతో దీనిని షేర్ చేయండి._x000D_
126
1
సంబంధిత వ్యాసాలు