AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
22 Jul 19, 10:00 AM
సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వ్యవసాయం రోజువారీ అవసరాలను నెరవేర్చడానికి మాత్రమే కాకుండా, వ్యాపార దృక్పథంతో చేయాలి!
నెదర్లాండ్స్ లోని రైతుల వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవడానికి కొన్ని నెలల క్రితం నెదర్లాండ్స్ రైతులను కలిసే అవకాశం మాకు లభించింది. రైతులు సాధారణగా కుళాయి నీటిని, తాగడానికి ఉపయోగించడం గమనించాము , కాని వారు మంచి నాణ్యమైన (బిస్లెరి లాంటి) నీటిని వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం రోజువారీ ప్రాథమిక అవసరాలను తీర్చడానికి మాత్రమే కాకుండా ఇదొక వ్యాపారంగా చేస్తున్నారు. డచ్ ప్రజలు తమ పంటల ఉత్పత్తుల నాణ్యత ఏ మాత్రం తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు, వ్యవసాయం పట్ల మనం ఈ మేరకు శ్రద్ధ వహిస్తున్నామా? వర్షాలు భారతదేశంలోని రైతులకు పెద్ద బహుమతి, ఎందుకంటే జూన్ నెలలో సంభవించే వర్షపాతం ఏడాది పొడవునా వ్యవసాయ అవసరాలకు సరిపడా నీటిని అందిస్తుంది. ఏదేమైనా, ప్రతి చుక్కను నిల్వను చేసే రైతులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నెదర్లాండ్స్ (యూరప్) లో, శీతాకాలంలో అధిక మంచు పడడంతో పాటు ఎప్పుడైనా వర్షపాతం వచ్చే అవకాశం ఉంటుంది; అటువంటి పరిస్థితులలో కూడా, రైతులు పాలిహౌస్ ద్వారా వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ఉష్ణోగ్రత, తేమ మరియు కాంతి పాలీహౌస్లో అవసరాన్ని బట్టి నిర్వహించబడతాయి. 5 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ, పాలీహౌస్ లోపల పంట ఉత్పత్తి కొనసాగుతుంది. నెదర్లాండ్స్‌లోని పాలీహౌస్ లేదా గ్లాస్‌హౌస్ మీద పడే ప్రతి వర్షపునీటిని సేకరించేలా అవి నిర్మానించబడినవి మరియు ఈ వేలాది లీటర్ల నీరు పాలీహౌస్ పక్కన నిర్మించిన చెరువులో నిల్వ చేయబడుతుంది. రైతు వర్షపునీటిని నిలువ చేసుకోనట్లయితే, సరైన పిహెచ్ మరియు ఇసి కలిగిన నీటిని పంటకు అందించడం కోసం అతను పర్యవసానాలను ఎదురుకోవలసి ఉంటుంది. నీటి నాణ్యత బాగా ఉంటే, వ్యవసాయం ప్రయోజనకరంగా ఉంటుంది; లేకపోతే , అన్ని వ్యవసాయ కార్యకలాపాలకు RO ఫిల్టర్ నీరు ఉపయోగించాల్సి ఉంటుంది. గత 5 సంవత్సరాలలో వారు సకాలంలో వర్షపాతం చూడలేదు, మరియు వర్షపాతం తగ్గడం మరియు తరచుగా తుఫానులు రావడం వల్ల వ్యవసాయం కష్టతరమైనది. మనకు సమృద్ధిగా సారవంతమైన నేలలు, వర్షపాతం, అనుకూలమైన వాతావరణం మరియు తగినంత సూర్యరశ్మి దాదాపు ఏడాది పొడవునా ఉన్నాయి, ఇలా అన్ని ఉన్నప్పటికీ, మన రైతులు ఎందుకు సంక్షోభంలో ఉన్నారు? భారతదేశంలో, ప్రతి రైతు లక్షలాది రూపాయలు పెట్టి గ్లాస్‌హౌస్ నిర్మించాల్సిన అవసరం లేదు కానీ నెదర్లాండ్స్‌లోని రైతుల మనస్తత్వం మరియు వ్యవసాయ విధానాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఒక వ్యాపార కోణం నుండి వ్యవసాయం గురించి ఆలోచించాలి మరియు ఎప్పటికప్పుడు వ్యవసాయం కొరకు ముఖ్యమైనవన్ని ఉపయోగించి ఉత్పత్తిని పెంచడానికి పని చేయాలి. ఉదాహరణకు, మట్టి పరీక్ష, నీటి నాణ్యత పరీక్ష, పంట మార్పిడి, నీటి సంరక్షణ, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, పచ్చి రొట్టె ఎరువులు, బయోకంట్రోల్ ఏజెంట్ల పరిరక్షణ మరియు పరిమిత రసాయన శిలీంద్ర సంహారిణిని ఉపయోగించడం, పరాగసంపర్కాన్ని పెంచడానికి తేనెటీగల సంరక్షణ. కనీస వ్యయంతో, ఈ విషయాలు సులభంగా సాధ్యమవుతాయి. మూలం: తేజస్ కొల్హే, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త
మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
310
0