గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వంకాయ కాండం మరియు కాయ తొలుచు పురుగు - ఐపిఎం
ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ (ఐపిఎం): ● పురుగును తట్టుకునే రకాన్ని నాటుకోవడానికి ఎంచుకోండి. ● వంకాయలో కాండం మరియు కాయ తొలుచు పురుగులు చేసే నష్టాన్ని తగ్గించడానికి ఆకులను కత్తిరించి వేయాలి. ● పొలాలలో ఎకరానికి @ 10-12 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయాలి. ● హాని జరగకుండా ఉండడానికి ప్రారంభ దశలో, బొటానికల్ పురుగుమందులను పిచికారీ చేయండి ● ఆవు-మూత్రం (20%) మరియు వేప, సీతాఫలం, తలంబ్రాల చెట్టు(లాంటానా కామెర) లేదా అడవి ఆముదం(జట్రోపా) (10%) నుండి తయారు చేసిన సారాన్ని పిచికారీ చేయండి.
పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే, క్లోరాంట్రానిలిప్రోల్ 18.5SC ను 4 మి.లీ లేదా ఎమామాక్టిన్ బెంజోయేట్ 5 SG 4 గ్రా లేదా థియోడికార్బ్ 75 WP 10 గ్రా లేదా సైపర్మెత్రిన్ 3% + క్వినాల్ఫోస్ 20 EC @ 5 మి.లీ లేదా డెల్టామెత్రిన్ 1% + ట్రయాజోఫోస్ 35% EC 10 మి.లీ.లను 10 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి. ● ప్రతి స్ప్రేకు పురుగుమందును మార్చి వాడండి. పంట అవశేషాలను పొలం సరిహద్దుల్లో వేయకూడదు మరియు వాటిని సరిగ్గా నాశనం చేయాలి. డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
553
1
సంబంధిత వ్యాసాలు