గురు జ్ఞాన్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
వరిలో దోమ నిర్వహణ
వరి పంటకు ప్రధానంగా పచ్చ దోమ, గోధుమ రంగు దోమ మరియు తెల్ల వీపు దోమ సోకుతుంది. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు పంటల నుండి రసాన్ని పీలుస్తాయి దీనివల్ల మొక్క కాల్చినట్లు (హాప్పర్ బర్న్) కనిపిస్తుంది. సమగ్ర సస్య రక్షణ (ఐపిఎం): • నారును త్వరగా ప్రధాన పొలంలో నాటుకోవడం వల్ల నష్టం తగ్గుతుంది • సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను మూడు ధపాలుగా ఇవ్వండి. • తెగులు ప్రారంభ దశలో పొలంలో నీటిని తక్షణమే తగ్గించాలి. • కార్బోఫ్యూరాన్ 3 జి @ 25 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3 జిఆర్ @ 20-25 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.5% + థియామెథోక్సామ్ 1% జిఆర్ @ 6 కిలోల హెక్టారుకు చొప్పున మట్టిలో ఇవ్వండి. • గుళిక రూపంలో ఉన్న పురుగుమందులు వాడకం సాధ్యం కాకపోతే, ఎసిటమాప్రిడ్ 20 ఎస్పి @ 4 గ్రా లేదా క్లోతియానిడిన్ 50 డబ్ల్యుజి @ 5 గ్రా లేదా బుప్రోఫెజిన్ 25 ఎస్సి @ 20 మి.లీ లేదా డైనోటోఫ్యూరాన్ 20 ఎస్ జి @ 4 గ్రా లేదా బుప్రోఫెజిన్ 15% + ఎసిఫేట్ 35% డబ్ల్యుపి @ 25 గ్రా లేదా డెల్టామెత్రిన్ 0.72% + బుప్రోఫెజిన్ 5.65% ఇసి @ 20 మి.లీ లేదా ఫెనోబుకార్బ్ 20% + బుప్రోఫెజిన్ 5% ఇసి @ 20 మి.లీ లేదా ఫ్లూబెండియామైడ్ 4% + బుప్రోఫెజిన్ 20% ఇసి @ 10 మి.లీ 10 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మీద పిచికారి చేయండి. • పురుగుమందులను పిచికారీ చేసేటప్పుడు స్ప్రేయర్ నాజిల్ ను కాండం వైపు ఉంచండి • ఈ మందులు వరిలో ఆకు ముడత పురుగు మరియు కాండం తొలుచు పురుగును కూడా నియంత్రిస్తాయి • పురుగు ఆశించిన ప్రారంభం దశలో పురుగుమందులను పురుగు సోకిన ప్రాంతంలో వాడండి.
డాక్టర్ టి. ఎం. భార్పోడా, Ex. ఎంట్రోమాలజీ ప్రొఫెసర్, B. A. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆనంద్- 388 110 (గుజరాత్ ఇండియా) మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
274
19
సంబంధిత వ్యాసాలు