సలహా ఆర్టికల్అద్బుతమైన ఆగ్రోస్టార్ వ్యవసాయ శాస్త్ర కేంద్రం
నీటిని సంరక్షణ జాగ్రత్తలు, నిర్వహణ
1) మట్టిలో తేమను కాపాడటానికి, అందుబాటులో ఉన్న సొంత నీటి వనరులను వాడుకోవాలి. 2) అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. బిందు మరియు తుంపర్ల సేద్యం వంటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థను ఇందుకు అత్యుత్తమమైన పద్దుతులు. 3) సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకునే సామర్ధ్యం నేలకు పెరుగుతుంది. 4) పండ్ల తోటలను ప్లాస్టిక్ కవర్లు లేదా ఎండిన ఆకులతో కప్పిఉంచడం వల్ల నీరు అవిరిగా మారే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు నేలలో తేమశాతం ఎక్కువకాలం ఉండేలా ఈ పద్దతి సహాయపడుతుంది.
5) పంట దశలను బట్టి నీటి అవసరాలు మారుతుంటాయి. మార్పులకు అనుగుణంగా ఎదుగుతున్న పంటలకు కావాల్సిన మొత్తంలో నీటి వనరులు అందించాలి. 6) నీటి లభ్యత తక్కువగా ఉంటే, ప్రత్యామ్నాయంగా వరుసపద్ధతి అనుసరించాలి. ఇది పంటకు అవసరమైన తేమశాతం నిరంతరం నేలలో ఉండేలా సహాయపడుతుంది. 7) తక్కువ నీటి అవసరం ఉన్న పశుగ్రాసం వంటి పంటలకు అనుసరించే నీటి యాజమాన్య పద్దతులను పరిశీలించండి. 8) పండ్ల తోటల్లో కొమ్మలకు నీటి ఆవశ్యకతను తగ్గించడానికి 8% కయోలిన్ మిశ్రమం లేదా 1 నుండి 2శాతం పొటాషియం నైట్రేట్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. 9) ఉద్యానవన పంటలను వేడిగాలుల నుంచి రక్షించుకోడానికి ఆయ తోటలకు పశ్చిమం, దక్షిణం ఇరువైపులా షెవారీ, సురు వంటి గాలిని నియంత్రించే చెట్లను పెంచుకోవచ్చు.
0
0
సంబంధిత వ్యాసాలు