AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Jun 19, 06:00 PM
పశుసంరక్షణగ్వాన్ కనెక్షన్
పశువుల కడుపులో పరాన్న జీవులను నివారించడం
పశువులలో కడుపులో ఉన్న పురుగులు లేదా అంతర్గత పరాన్న జీవులు ఉన్నా, అవగాహనా లోపం కారణంగా వాటికి ఔషధాలను ఇవ్వడం జరగదు. తత్ఫలితంగా జంతువులు బలహీనపడడంతో పాటు యజమానులకు ఆర్థిక నష్టం కూడా వాటిల్లుతుంది. పశువుల కడుపులలో పెరిగే పురుగులను అతి పెద్ద సమస్యగా పరిగణించాలి. పురుగుల నివారణ ఔషధాలను పశు సంపదకు ఇవ్వడం ద్వారా, పశువుల పెంపకం లాభదాయకంగా కూడా ఉంటుంది. పశువుల కడుపులలో పురుగులు ఉన్నట్లయితే, అవి 30 శాతం నుంచి 40 శాతం వరకు జంతువు తీసుకునే ఆహారాన్ని భుజిస్తాయి; సరైన ఔషధాల ద్వారా దీనిని సమర్ధవంతంగా నివారించవచ్చు. పశువుల కడుపులలో పురుగులను గుర్తించే లక్షణాలు: ● పశువు బురదను తినడం ప్రారంభిస్తే ● పశువుల కదలికలు నిదానంగా ఉండడం, బలహీనంగా కనిపించడం ● దుర్గధం వెదజల్లే, పలుచని మరియు ఆకుపచ్చని అతిసారం ● పేడలో నల్ల రంగు రక్తం మరియు పురుగులు కనిపించడం ● గడ్డి తగిన విధంగా స్వీకరిస్తున్నా శరీర పెరుగుదల తగ్గడం మరియు కడుపు పరిమాణం పెరగడం ● రక్త హీనత ● హఠాత్తుగా పాలు తగ్గిపోవడం ● సమస్యాత్మక గర్భం
ముఖ్యమైన అంశాలు: ● కడుపులో పరుగులను నివారించేందుకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి తగిన ఔషధాలను తప్పకుండా ఇవ్వాలి. ● చిన్న కంటైనర్లో పేడను సేకరించి, దానిని పరీక్షించిన తరువాత మాత్రమే మందులను ఇవ్వాలి. ● పశు వైద్యుడు వైద్య పరీక్ష చేసిన తరువాత పశువు బలహీనంగా, అనారోగ్యంగా ఉందని నిర్ధారిస్తే, తప్పనిసరిగా ఔషధాలను అందించాలి. ● టీకాలు వేసేందుకు ముందు మాత్రమే పురుగులను నివారించే మందులను పశువులకు ఇవ్వాలి, వాక్సినేషన్ తర్వాత ఇవ్వకూడదు. ● టీకాలు వేసిన వెంటనే పశువులకు ఔషధాలు ఇవ్వకూడదు; తప్పనిసరిగా 15 రోజుల పాటు వేచి ఉండాలి. ● పశు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే పేగులలో పురుగులను నివారించే మందులను ఇవ్వాలి. ● పశువులకు ఆహారంగా తాజా గడ్డి మరియు ధాన్యాలను ఇవ్వాలి. ● పరిశుభ్రమైన తాగు నీరు అందించాలి. మూలం: గాంవ్ కనెక్షన్ మీరు ఈ సమాచారాన్ని ఉపయోగకరంగా కనుగొంటే, ఫోటో క్రింద ఉన్న పసుపు బొటనవేలు పై క్లిక్ చేయండి మరియు క్రింద ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి మీ రైతు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి
517
0